ETV Bharat / sitara

హీరోయిన్లను అవమానిస్తే అస్సలు ఊరుకోను: మంచు విష్ణు

author img

By

Published : Oct 24, 2021, 5:04 PM IST

కథానాయికల(maa association president 2021) పట్ల హద్దులు మీరే యూట్యూబ్ ఛానెల్స్​పై ఇక నుంచి కఠిన చర్యలు తప్పవని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(maa elections 2021 winner) హెచ్చరించారు. నటీమణుల గౌరవాన్ని దెబ్బతిసే ఛానల్స్​ను ఉపేక్షించేదే లేదన్న విష్ణు... త్వరలోనే మా అసోసియేషన్ నుంచి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

manchu vishnu
మంచు విష్ణు

కథానాయికలపై(maa association president 2021) అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించేది లేదని నటుడు, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు(maa elections 2021 winner) హెచ్చరించారు. తెలుగు ఫిల్మ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సన్మాన కార్యక్రమంలో మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు నటుల పట్ల దారుణంగా ప్రవరిస్తున్నాయని, అసభ్యకరంగా వ్యవహరించే అలాంటి ఛానళ్లపై చర్యలు తప్పవన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల థంబ్‌నైల్స్‌ హద్దులు మీరుతున్నాయని మండిపడ్డారు.

నటీమణులు మన ఆడపడుచలని, వారిని గౌరవించాలని విష్ణు(maa elections manchu vishnu panel) విజ్ఞప్తి చేశారు. హీరోయిన్లపై అభ్యంతరకర వీడియోలు పెడితే ఉపేక్షించమన్నారు. యూట్యూబ్‌ ఛానళ్ల నియంత్రణకు ప్రత్యేక లీగల్‌ సెల్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పరిధి దాటే ఇలాంటి యూట్యూబ్‌ ఛానళ్లను నియంత్రిండం తన ఎజెండాలో ఓ అంశమని పేర్కొన్నారు. తెలుగు మీడియా ఎప్పుడూ హద్దులు దాటలేదని, తన కుటుంబానికి, చిత్ర పరిశ్రమకి సహకారం అందిస్తూనే ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: 'మా' మహిళా భద్రత కోసం కమిటీ: మంచు విష్ణు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.