Sarkaru vaari paata: సంక్రాంతి రేస్ నుంచి 'సర్కారు వారి పాట' ఔట్

author img

By

Published : Nov 3, 2021, 4:09 PM IST

mahesh babu sarkaru vaari paata

మహేశ్​ 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) చిత్రానికి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు. సంక్రాంతికి కాకుండా ఏప్రిల్​లో 1న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. కొత్త పోస్టర్​ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'(sarkaru vaari paata release date) సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ముందే చెప్పినట్లు జనవరి 13న కాకుండా ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో 'ఆర్ఆర్ఆర్'(rrr teaser), 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్'(bheemla nayak song download) ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

mahesh babu sarkaru vaari paata NEW release date
మహేశ్ సర్కారు వారి పాట మూవీ కొత్త పోస్టర్

బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్​కు జోడీగా కీర్తి సురేశ్(keerthy suresh movies) నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

mahesh babu sarkaru vaari paata
సర్కారు వారి పాటలో మహేశ్, కీర్తి సురేశ్

ఇది పూర్తయిన తర్వాత త్రివిక్రమ్​తో(trivikram next movie) కలిసి పనిచేస్తారు మహేశ్. వీరి కాంబినేషన్​లో రాబోయే మూడో చిత్రమిది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన 'అతడు', 'ఖలేజా'.. ప్రేక్షకులను ఎంతలా ఆదరిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ అనేసరికి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్(pooja hegde movies). తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.