ETV Bharat / sitara

హోటల్‌లో నరేశ్‌ వీకెండ్​ పార్టీ- వైరల్‌గా మారిన ఇన్విటేషన్‌

author img

By

Published : Sep 3, 2021, 12:54 PM IST

'మా' అధ్యక్షుడు నరేశ్‌ (Maa president) వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు నెట్టింట్లో ఓ మెసేజ్​ హల్​చల్ చేస్తోంది. నగరంలోని దసపల్లా ఫోరమ్‌ హాల్‌లో తన తోటి నటీనటులకు ఆయన పార్టీ ఇవ్వనున్నట్లు ఇందులో ఉంది.

invitation message from Naresh goes viral
హోటల్‌లో నరేశ్‌ పార్టీ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ప్రస్తుత అధ్యక్షుడు (Maa president), నటుడు నరేశ్‌ వీకెండ్‌ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో తన తోటి నటీనటులకు ఆయన పార్టీ ఇవ్వనున్నారట. ఇందుకు సంబంధించిన ఓ మెస్సేజ్‌ (Maa president WhatsApp messages) వైరల్‌గా మారింది. నగరంలోని దసపల్లా ఫోరమ్‌ హాల్‌లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి పార్టీ జరగనుందని.. ఈ మేరకు శుక్రవారం అందరికీ ఆహ్వానం అందుతుందంటూ నరేశ్‌ విజయ కృష్ణ పేరుతో ఓ వాట్సాప్‌ మెస్సేజ్‌ పెట్టారు.

మరికొన్ని రోజుల్లో 'మా' ఎన్నికలు(Maa Elections) జరగనుండగా.. ఈ వాట్సాప్‌ మెస్సేజ్‌ ఇప్పుడు తెలుగు చిత్రసీమలో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు గత నెల 29న నాగార్జున పుట్టినరోజుని పురస్కరించుకుని 'బిగ్‌బాస్‌' కంటెస్టెంట్‌లందరికీ ప్రకాశ్‌రాజ్‌ ఆఫీస్‌లో పార్టీ ఇస్తారని గతంలో ఓ మెస్సేజ్‌ బయటకు వచ్చింది. సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికే ఇలా, ఒకరి తర్వాత మరొకరు పార్టీలు ఇస్తున్నారని సమాచారం.

ఇదీ చూడండి: Movie review: ఈ ప్రేమకథ మనసుల్ని బరువెక్కించిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.