Maa elections 2021: 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

author img

By

Published : Oct 10, 2021, 7:35 AM IST

Updated : Oct 11, 2021, 12:38 AM IST

maa elections

00:25 October 11

మా ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు: బండి సంజయ్‌

'మా' అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణుతో సహా ఇరు ప్యానెళ్లలోని విజేతలందరికీ భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌చేశారు. 'మా' ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూశారన్నారు. 'మా' ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారని, అందరికీ అభినందనలు తెలుపుతున్నట్లు బండి సంజయ్‌ తెలిపారు. 

విష్ణును ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: మోహన్‌బాబు

'మా' ఎన్నికల్లో విష్ణును ఆశీర్వదించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతున్నట్లు మోహన్‌బాబు తెలిపారు. ఇక నుంచి 'మా' ఎన్నికలు ఏకగ్రీవమయ్యేలా చూసుకుంటామని తెలిపారు. జరిగిందేదో జరిగింది అని, అందరం ఒకే కుటుంబం అని మోహన్‌బాబు అన్నారు. ఇక నుంచి వివాదాలకు దూరంగా ఉందామని పిలుపునిచ్చారు. అధ్యక్షుడికి చెప్పకుండా ఎవరూ మీడియా ముందుకు వెళ్లవద్దని గెలిచిన సభ్యులకు సూచించారు. 

'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

'మా' సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు ప్రకటించారు. మంచు విష్ణు గెలిచిన కొద్దిసేపటికే నాగబాబు ఈ నిర్ణయం తీసుకొని ఒక్కసారిగా షాక్‌ ఇచ్చారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో 'మా' కొట్టుమిట్టాడుతోందని, ఇలాంటి అసోసియేషన్‌లో కొనసాగడం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నట్లు నాగబాబు పేర్కొన్నారు. 48 గంటల్లో రాజీనామాను 'మా' కార్యాలయానికి పంపుతానన్నారు. ఎంతగానో ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పూర్తి చిత్తశుద్ధితో రాజీనామా నిర్ణయం తీసుకున్నానని  నాగబాబు తెలిపారు. 

మంచు విష్ణుకు అభినందనలు తెలిపిన చిరంజీవి

'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. 'మా' నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌, మిగతా విజేతలందరికీ పేరు పేరునా నా అభినందనలు. ఈ నూతన కార్యవర్గం మూవీ ఆర్టిస్టులందరి సంక్షేమానికి పాటుపడుతుందని ఆశిస్తున్నాను. 'మా' ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే కుటుంబం. ఇందులో ఎవరు గెలిచినా మన కుటుంబం గెలిచినట్టే. ఆ స్ఫూర్తితోనే ముందుకు సాగుతామని నమ్ముతున్నాను' అని చిరంజీవి పేర్కొన్నారు.    

ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టిన విష్ణు

'మా' ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. ప్రకాశ్‌రాజ్‌ను ఆలింగనం చేసుకొని కంటతడి పెట్టారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. 'మా' ఎన్నికలు ఇంత దూరం వచ్చి ఉండకూడదన్నారు. మేమంతా ఒకే కుటుంబం అని, కలిసి పనిచేస్తామని విష్ణు అన్నారు. ఇది తెలుగు నటీనటుల ఆత్మగౌరవానికి దక్కిన విజయమన్నారు.

23:20 October 10

హోరాహోరీగా సాగిన 'మా' ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రకాశ్‌రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. విష్ణుకు 380 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు వచ్చాయి.  'మా' చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. 'మా'లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

22:52 October 10

'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం

ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు విజయం

21:19 October 10

'మా' అధ్యక్ష ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ను కౌంటింగ్‌ కేంద్రం వద్దకు పిలిచిన అధికారి

21:08 October 10

'మావైస్‌ ప్రెసిడెంట్‌గా మాదాల రవి గెలుపు

విష్ణు ప్యానెల్ నుంచి గెలుపొందిన మాదాల రవి

బెనర్జీపై గెలుపొందిన మాదాల రవి

20:55 October 10

'మా' ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ గెలుపు

ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌ నుంచి శ్రీకాంత్ విజయం

బాబూమోహన్‌పై విజయం సాధించిన శ్రీకాంత్‌

20:40 October 10

'మా' అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ఆధిక్యం

ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్‌ ఆధిక్యం

విష్ణు ప్యానల్‌లోని బాబూమోహన్‌పై శ్రీకాంత్‌ ఆధిక్యం

20:25 October 10

విష్ణు ప్యానెల్​ దూకుడు..

'మా' కోశాధికారిగా శివబాలాజీ విజయం

విష్ణు ప్యానల్‌లోని శివబాలాజీ విజయం

ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని నాగినీడుపై శివబాలాజీ విజయం

20:20 October 10

'మా' జనరల్‌ సెక్రటరీగా రఘుబాబు విజయం

జీవిత రాజశేఖర్‌పై 7 ఓట్ల తేడాతో రఘుబాబు విజయం

ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌లోని జీవితపై గెల్చిన విష్ణు ప్యానల్​లోని రఘుబాబు

19:28 October 10

మంచు విష్ణు ప్యానెల్‌లో 8 మంది విజయం

విష్ణు ప్యానల్‌లో 8 మంది కార్యవర్గ సభ్యులు విజయం

విష్ణు ప్యానెల్‌లో మాణిక్హరినాథ్ బొప్పన శివ గెలుపు

విష్ణు ప్యానెల్‌లో పసునూరి శ్రీనివాస్శ్రీలక్ష్మి విజయం

విష్ణు ప్యానెల్‌లో జయవాణిశశాంక్పూజిత విజయం

19:15 October 10

కొనసాగుతున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

'మా' కార్యవర్గ సభ్యుల ఓట్ల లెక్కింపు పూర్తి

18:59 October 10

.
.

'మాఎన్నికలో వెలువడుతున్న ఫలితాలు

ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌లో శివారెడ్డి విజయం

'మాకార్యవర్గ సభ్యుడిగా శివారెడ్డి విజయం

ప్రకాశ్​రాజ్​ ప్యానెల్​లోని కౌశిక్‌, అనసూయ, సురేశ్‌ కొండేటి గెలుపు

18:41 October 10

కొనసాగుతున్న 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు

ఓట్ల కౌంటింగ్‌ కోసం 6 టేబుళ్లు ఏర్పాటు

ఒక్కో కౌంటింగ్‌ టేబుల్‌ వద్దకు ఇద్దరికి అనుమతి

ముందుగా 'మా' కా‌ర్యవర్గ సభ్యుల ఓట్ల లెక్కింపు

అనంతరం అధ్యక్ష అభ్యర్థులు ఓట్ల లెక్కింపు

లెక్కింపును పర్యవేక్షిస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు

16:08 October 10

మా ఎన్నికలో ఓటు వేయలేకపోయిన ప్రముఖ నటులు

ఓటు వేయని మహేశ్‌బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌, రానా, రకుల్‌, త్రిష, అనుష్క, ఇలియానా, హన్సిక తదితరులు

16:06 October 10

'మాఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

అరగంట ముందుగా ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ

కా‌ర్యవర్గ సభ్యులకు పోలైన ఓట్లను వేరు చేస్తున్న సిబ్బంది

ముందు 'మా' ఈసీ సభ్యుల ఓట్ల లెక్కింపు

అనంతరం అధ్యక్ష అభ్యర్థుల ఓట్లు లెక్కింపు

ఓట్లు అధికంగా రావడంతో లెక్కింపు ప్రక్రియ ముందే ప్రారంభం

ఓట్లను కట్టలు కడుతున్న ఎన్నికల సిబ్బంది

ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు

ప్యానెల్‌ సభ్యులకే లెక్కింపు వేదిక వద్దకు అనుమతి

15:04 October 10

హైదరాబాద్: ముగిసిన 'మా' ఎన్నికల పోలింగ్

క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం

'మా' ఎన్నికల్లో 600కిపైగా ఓట్లు పోలైనట్లు అంచనా

గతంతో పోలిస్తే ఈసారి పెరిగిన పోలింగ్ శాతం

'మాచరిత్రలోనే అత్యధిక శాతం పోలింగ్‌ నమోదు

సుదూర ప్రాంతాల నుంచి ఓటింగ్‌కు తరలివచ్చిన సభ్యులు

ముంబయిచెన్నైబెంగళూరు నుంచి వచ్చిన సభ్యులు

2017-2019 'మా' ఎన్నికలో పోలైన 442 ఓట్లు

ఓటింగ్‌ శాతం పెరగడంతో 'మాసభ్యుల్లో ఆనందం

సా.5 గం.కు ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం

14:51 October 10

నటీనటుల్లో బాగా చైతన్యం వచ్చింది: ప్రకాశ్‌రాజ్

ఇప్పటికే 500కిపైగా ఓట్లు పోలయ్యాయి: ప్రకాశ్‌రాజ్‌

ఎన్నికలపై బాగా చర్చ జరగడం వల్లే నటులు వచ్చి ఓటేశారు: ప్రకాశ్‌రాజ్

ఓటు వేయడానికి వచ్చి అందరిని కౌగిలించుకున్నారు: ప్రకాశ్‌రాజ్

పెరిగిన ఓటింగ్‌.. మార్పునకు సంకేతం: ప్రకాశ్‌రాజ్

14:03 October 10

కనీసం మరో వంద ఓట్లు పోలవుతాయి: మంచు విష్ణు

లోపల 50 మంది వరకు క్యూలో ఉన్నారు: మంచు విష్ణు

పలు రాష్ట్రాల నుంచి నటులు వచ్చి ఓటేశారు: మంచు విష్ణు

ఇతర రాష్ట్రాల నుంచి రావడం 'మా' చరిత్రలో తొలిసారి: విష్ణు

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం రావాలని కోరాను: మంచు విష్ణు

నేను ఫోన్‌ చేసిన వారందరూ వచ్చి ఓటేశారు: మంచు విష్ణు

పోలింగ్ సమయం మరో గంట పొడిగించారు: మంచు విష్ణు

అందరు వచ్చి ఓటేయండి: మంచు విష్ణు

13:58 October 10

ఓటు హక్కు వినియోగించుకున్న అఖిల్‌

'మా' ఎన్నికల్లో భాగంగా అఖిల్‌, సుధీర్‌బాబు, నటి అనుపమ పరమేశ్వరన్‌లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన సినీతారలను చూసేందుకు అభిమానులు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు భారీగా తరలివచ్చారు. నటీనటులతో సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. వారిని అదుపు చేయటం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. 

13:48 October 10

పోలింగ్​ గంట పొడిగింపు

మధ్యాహ్నం 2గంటలతో ముగియనున్న ‘మా’ ఎన్నికల పోలింగ్‌ను మరో గంట పాటు పొడిగిస్తున్నట్లు ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ తెలిపారు. ఈ విషయమై ఇరు ప్యానెళ్లతో ఎన్నికల అధికారులు చర్చించగా, ఇరువురు ఒప్పుకొన్నారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్‌ 3గంటల వరకూ కొనసాగనుంది.

మధ్యాహ్నం 1.30గం.లకు ఎంతమంది ఓటు వేశారంటే?

'మా' ఎన్నికల్లో పోలింగ్‌ తుది దశకు వచ్చింది. ఓటు వేసేందుకు మధ్యాహ్నం 2గంటల వరకూ సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మధ్యాహ్నం 1.30గంటలకు 56శాతం పోలింగ్‌ నమోదైంది. ఇప్పటివరకూ 503 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలైన్‌లో ఇంకా 100మందికి పైగా ఉన్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో కేవలం 474 ఓట్లు మాత్రమే పోలవడం గమనార్హం.

విష్ణు గెలుపు ఖాయం: నరేశ్‌

తాజా ఎన్నికల్లో విష్ణు గెలుపుఖాయమని సినీ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల పాలనకు పడే ఓటు ఇదని అన్నారు. కొందరు పిచ్చికుక్కల్లా మాట్లాడారని, వాళ్లందరి నోళ్లు మూయించే ఎన్నికలని  నరేశ్‌ వ్యాఖ్యానించారు.

13:28 October 10

mohan
మోహన్​బాబు

"ఈ గొడవలన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకర్థం కావటం లేదు. ఫలితం ఏ వస్తుందో చూద్దాం! గెలుస్తామన్న నమ్మకం ఉంది. సినిమా తీసినప్పుడు 'ఈ సినిమా హిట్‌ అవుతుంది' అని ఏవిధంగా గుర్తిస్తామో ఇది కూడా అంతే. ప్రజలు, సాయిబాబా ఆశీస్సులతో విష్ణు గెలుస్తాడు. 'మా' సభ్యులే నా బలం. ఇప్పుడున్న గొడవలు చూస్తుంటే రామ-రావణ యుద్ధంలా ఉంది. ఇదంతా అవసరమా? అనిపిస్తోంది’’ -పోలింగ్‌ కేంద్రం వద్ద మోహన్‌బాబు

ఓటు హక్కు వినియోగించుకున్న నాగార్జున

'మా' ఎన్నికల్లో అగ్ర కథానాయకుడు నాగార్జున ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయప్రద, అల్లరి నరేశ్‌, అలీ తదితరులు ఓటు వేశారు. ఆదివారం అలీ పుట్టినరోజు కావడం వల్ల ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

13:04 October 10

త్వరగా వెళ్లిపోండి: మోహన్‌బాబు

'మా' ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఓటు వేసిన తర్వాత 'మా' సభ్యులు ఐదు నిమిషాల్లో వెళ్లిపోవాలని సినీ నటుడు మోహన్‌బాబు వారిని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు

వారికి ప్రాధాన్యం ఇవ్వండి: ఆర్‌ నారాయణమూర్తి

ఇక్కడి వాళ్లు జాతీయ స్థాయి సినిమాలు తీయడం సంతోషించాల్సిన విషయమని సినీ నటుడు, దర్శకుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. మా ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో తెలుగు కళాకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

12:47 October 10

పోలైన ఓట్లు ఇవే!

'మా' ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు సినీ ప్రముఖులు పోలింగ్‌ కేంద్రానికి తరలివస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి 430 ఓట్లు పోలయ్యాయి. 925మంది 'మా' సభ్యులు ఉండగా, అందులో 883మందికి ఓటు హక్కు ఉంది.

'మా' ఎన్నికలు.. ఫొటో ఆఫ్‌ ది డే

'మా' ఎన్నికల అధ్యక్ష అభ్యర్థులుగా ప్రకాశ్‌రాజ్‌, మంచ విష్ణు పోటీపడుతున్నారు. పోలింగ్‌ సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను మంచు విష్ణు పంచుకున్నారు.

12:27 October 10

బండ్లగణేశ్​

ఎన్నికలంటేనే గొడవ అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ అన్నారు. 'మా' ఎన్నికల్లో భాగంగా ఓటు వేయడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 'పోలింగ్‌ కేంద్రంలో గొడవ జరుగుతోందట' అని విలేకరులు అడగ్గా, హత్యలు, అత్యాచారాలైతే జరగడం లేదు కదా అని అన్నారు. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారని, కావాలంటే రాసిస్తానని తెలిపారు. తాను ఓటేసిన వ్యక్తులు గెలుస్తారని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

11:47 October 10

అందుకే శివబాలాజీ చేయి కొరికా: హేమ

maa
మంచు విష్ణు, హేమ

తాను వెళ్తున్న సమయంలో శివ బాలాజీ చేయి అడ్డుగా పెట్టారని, తప్పుకోమంటే తప్పుకోలేదని, అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ అన్నారు. దాని వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని తెలిపారు. ప్రస్తుతం పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు హేమ పేర్కొన్నారు. ఇక తనకూ బెనర్జీకి ఎలాంటి గొడవ జరగలేదని నటుడు శివ బాలాజీ అన్నారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ప్రచారం చేస్తుంటే వాగ్వాదం మాత్రమే జరిగినట్లు తెలిపారు. హేమ కొరికిన విషయాన్ని తేలిగ్గా కొట్టి పారేశారు.

11:35 October 10

rajendra prasad
రాజేంద్రప్రసాద్​

పోటీ ఉంటే ఫలితం వేరు

జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా పోటీ ఉంటే దాని ఫలితం వేరుగా ఉంటుందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మా ఎన్నికల్లో పోటీ తనతోనే మొదలైందని అన్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా, తమలో ఒకరే కదానని వ్యాఖ్యానించారు. 'మా' అసోసియేషన్‌కు ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

11:15 October 10

జెనీలియా
maa
జెనీలియా, మంచు విష్ణు

సూపర్‌ ప్రెసిడెంట్‌ రాబోతున్నారు: జెనీలియా

తెలుగు చిత్ర  పరిశ్రమ తనకు పుట్టినిల్లు అని కథానాయిక జెనీలియా అన్నారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తెలుగు సినిమాలకు ఆమె దూరంగా ఉన్నారు. ‘మా’ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ వచ్చిన ఆమె మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. అతి త్వరలో సూపర్‌ ప్రెసిడెంట్‌ రాబోతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కు ఓటేశా: నాగబాబు

'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌కే తాను ఓటు వేశానని సినీ నటుడు నాగబాబు అన్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఎవరికి ఓటు వేశారు' అని ప్రశ్నించగా, మూడు రోజులుగా చెబుతున్నా, కొత్తగా ఏం చెబుతానని అన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి ఓటు వేసినట్లు తెలిపారు.

11:02 October 10

nithtya
నిత్యామేనన్​

'మా' ఎన్నికల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. చిన్న చిన్న వివాదాలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు మా అధ్యక్ష అభ్యర్థులు ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు తెలిపారు. ఉదయం 10.30 గం.లకు 240మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 925మంది 'మా' సభ్యులు ఉండగా, అందులో 883మందికి ఓటు హక్కు ఉంది. సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌, రామ్‌చరణ్‌, బ్రహ్మానందం, పోసాని, నరేశ్‌, శివ బాలాజీ, నిత్యామేన్​ ఇలా సినీ నటులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

10:42 October 10

roja
రోజా

ప్రస్తుతం మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎవరూ ఎవరికీ శత్రువులు కాదని, సినీనటి, ఎమ్మెల్యే రోజా అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. "ఎవరు ఎలా మాట్లాడుకున్నా పర్వాలేదు. ఇక్కడ ఉన్నది 900మంది మాత్రమే. అందరం ఒకే కుటుంబం. కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఉదయం అందరూ కలిసికట్టుగా కనిపించడం సంతోషంగా ఉంది. కనీసం ఇప్పటికైనా మంచి వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా, రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నా. ఇరు ప్యానెల్స్‌లోనూ నాతో పనిచేసిన నటులు ఉన్నారు. ఎవరు ఎక్కువ సమయం కేటాయించి కళాకారుల సమస్యలు తీరుస్తారో, దాన్ని బట్టే అందరూ ఓటు వేస్తారు. కరోనా కారణంగా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. విద్వేష రాజకీయాలు ఇక్కడితో ఆపండి. పక్క నుంచి మాట్లాడేవాళ్ల వల్ల ఈ గొడవలు జరుగుతున్నాయి. ఎవరు ఎవరికీ శత్రువులు కాదు" అని అన్నారు.

10:32 October 10

naresh
నరేశ్​, శివబాలాజి

'మా' ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా ఇరు ప్యానెల్‌ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చోటు చేసుకుంది. పోలింగ్‌ కేంద్రం వద్ద జరిగిన గొడవపై సినీ నటుడు నరేశ్‌ స్పందించారు."గొడవేమీ లేదు. అది చాలా చిన్నది. ఎవరో ఒకరు ప్రకాశ్‌రాజ్‌ బ్యాడ్జ్‌ వేసుకుని రిగ్గింగ్‌  చేయడానికి ప్రయత్నిస్తే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశాం. నేను, ప్రకాశ్‌రాజ్‌ కౌగిలించుకున్నాం. 'నో ఫైటింగ్‌.. ఓన్లీ ఓటింగ్‌' అని చెప్పుకొన్నాం. శివబాలాజీని హేమగారు కొరికారు" అని నరేశ్‌ అన్నారు.

10:15 October 10

మళ్లీ ఉద్రికత్త

'మా' ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్యానెల్‌ సభ్యులు కాకుండా బయటి వ్యక్తులు లోపలికి రావడంపై విష్ణు ప్యానెల్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతరులు లోపలికి రావడంతో ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది. మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తిని  విష్ణు ప్యానెల్‌ అడ్డుకుంది. ప్రకాశ్‌రాజ్‌ గన్‌మెన్లను కూడా పోలింగ్‌ కేంద్రంలోకి అనుమతించేది లేదని ఎన్నికల అధికారి తెలిపారు.

రిగ్గింగ్‌కు అవకాశమే లేదు: కరాటే కళ్యాణి

'మా' ఎన్నికల్లో రిగ్గింగ్‌కు అవకాశమే లేదని సినీ నటి కరాటే కళ్యాణి అన్నారు. సాధారణ ఎన్నికల్లోనే రిగ్గింగ్‌ జరగడం లేదని, అలాంటిది ‘మా’ ఎన్నికల్లో ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. 'మా' ఎన్నికల అధికారి సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలిస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

10:06 October 10

మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుండేది: సుమన్‌

'మా' ఎన్నికల అధ్యక్ష బరిలో మహిళలకు కూడా అవకాశం ఇస్తే బాగుండేదని సినీ నటుడు సుమన్‌ అన్నారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడారు. "ఈ ఎన్నికలు వాడీవేడీగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన నిబంధనలు రావాలంటే కష్టం. ఏపీలో షూటింగ్స్‌ చేసుకునేందుకు ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా తెలంగాణలో చిన్న నిర్మాతల కోసం సీఎం కేసీఆర్‌ కూడా ఫిల్మ్‌సిటీ నిర్మించాలి. లోకల్‌, నాన్‌-లోకల్‌ అనే అంశం రాకూడదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి షూటింగ్స్‌లో పాల్గొంటాం" అని సుమన్‌ అన్నారు.

10:00 October 10

'మా' ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొందరు ప్యానెల్‌ సభ్యులు లోపలికి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. గేటు బయట ప్రచారం చేసుకోవాల్సిందిగా వాగ్వాదానికి దిగారు. ‘ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేస్తున్నారు’ అని మోహన్‌బాబు పోలింగ్‌ బూత్‌లో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సమీర్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. శివబాలాజీ-హేమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

09:44 October 10

balakrishna
బాలకృష్ణ

 బాలకృష్ణ

'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.  "ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా. రెండు ప్యానెల్స్‌ ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు, చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారు వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం" అని బాలకృష్ణ అన్నారు.

09:31 October 10

chiru
చిరు

నా అంతరాత్మ ప్రభోదానికి అనుగుణంగా ఓటు వేశా: చిరంజీవి

'మా' ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదన్న చిరు,  భవిష్యత్‌ ఇలా జరగకుండా ఉండేలా మా ప్రయత్నాలు చేస్తామన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని, అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని, దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.

09:20 October 10

30శాతం పోలింగ్‌ పూర్తయింది: నరేశ్‌

తాజా ఎన్నికల్లో ఉదయం 9గంటల సమయానికే దాదాపు 30శాతం మంది 'మా' సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సినీ నటుడు, 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్‌ అన్నారు. గతంతో పోలిస్తే ఈ సారి 500లకు పైగా మా సభ్యులు ఓటు వేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకున్న చిరంజీవి, బాలకృష్ణ

'మా' ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ నటులు పోలింగ్‌ కేంద్రానికి చేరుకుంటున్నారు. తాజాగా అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ 'మా'ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

09:08 October 10

ramcharan
రామ్​చరణ్​

ఓటు హక్కు వినియోగించుకున్న రామ్‌చరణ్‌

'మా' ఎన్నికల్లో సినీ నటుడు రామ్‌చరణ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయనతో పాటు సుమ, శ్రీకాంత్‌, నరేశ్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌, శివబాలాజీ, సుడిగాలి సుధీర్‌, రాఘవ తదితరులు ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు.

ఎవరు గెలిచినా 'మా' గెలిచినట్టే: సాయికుమార్‌

మా ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకున్నానని సినీ నటుడు సాయికుమార్‌ అన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో  పోటీ చేయలేకపోయినట్లు తెలిపారు. లోకల్‌, నాన్‌-లోకల్‌ కాదు తాను నేషనలిస్ట్‌ అని అన్నారు. ‘మా’ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, మొత్తం ‘మా’ గెలిచినట్టేనని స్పష్టం చేశారు.

08:50 October 10

'మా' పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత

'మా' పోలింగ్‌ కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తీరుపై మంచు విష్ణు మెంబర్స్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం లోపల ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. నమూనా బ్యాలెట్‌ ఇస్తున్న శివారెడ్డిని శివబాలాజీ అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువురిని అక్కడి నుంచి పంపించేశారు.

08:50 October 10

'మా' ఎన్నికల్లో కొనసాగుతున్న పోలింగ్‌

'మా' ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ నటులు పవన్‌కల్యాణ్‌, మోహన్‌బాబు, పోసాని కృష్ణమురళి, సాయికుమార్‌, మంచు లక్ష్మీ, వడ్డే నవీన్‌ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు మంచు విష్ణు ప్యానెల్‌, ఇటు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యులు ఉదయం నుంచి పోలింగ్‌ కేంద్రం వద్దే ఉన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారితో ఇరు వర్గాలు సరదాగా మాట్లాడుకుంటున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి.

08:25 October 10

ఎవరెవరు ఏయే వేషాలేస్తున్నారో ఓటర్లకు తెలుసు: ప్రకాశ్‌రాజ్‌

"పోలింగ్‌ అధికంగా ఉండాలని కోరుకుంటున్నా. ఎప్పుడూ లేని చైతన్య వచ్చింది.  ఇది ఓటర్ల సమయం. ఎవరికి బాధ్యత అప్పజెపుతారో చూడాలి. ప్రలోభాలు ఏంటో వాళ్లకు తెలుసు. కళాకారులు కదా సున్నితమైన మనసు కలిగిన వాళ్లు. ఎన్నో పాత్రలు వేసిన వాళ్లకు ఎవరెవరు ఏయే వేషాలు వేస్తున్నారో తెలియదా? వాగేవాళ్లు వాగుతూ ఉంటారు. మనమేంటో ఓటర్లకు తెలుసు" 

08:15 October 10

pawan
పవన్​కల్యాణ్​

'మా' ఎన్నికల్లో ఓటు వేసిన పవన్‌

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ 'మా' ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై 'మా' ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని పునరుద్ఘాటించారు.

సినిమా పరిశ్రమ చీలడం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు: పవన్‌

'మా' ఎన్నికల్లో తిప్పికొడితే 900 ఓట్లు ఉంటాయి: పవన్‌

సినిమాలు చేసే వాళ్లు ఆదర్శంగా ఉండాలి: పవన్‌ 

వ్యక్తిగత దూషణలు ఇబ్బందికరంగా ఉంటాయి: పవన్‌

వ్యక్తుల వ్యాఖ్యలతో సినీ రంగానికి సంబంధం ఉండదు: పవన్‌

'మా' ఎన్నికలు సున్నితంగాఏకగ్రీవంగా జరగాల్సింది: పవన్‌

చాలాసార్లు ఓటేసినా.. ఈ స్థాయి ఎన్నికలు చూడలేదు: పవన్‌

08:10 October 10

manchu vishnu
మంచు విష్ణు ప్యానల్​

'మా' ఎన్నికల పోలింగ్‌ మొదలైంది!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో పోలింగ్‌ మొదలైంది. 'మా'లో మొత్తం 925మంది సభ్యులు ఉండగా, 883మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. సుమారు 500లకు పైగా 'మా' సభ్యులు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2గంటల వరకూ పోలింగ్‌ జరగనుండగా, సాయంత్రం 4గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. తెలంగాణ కో-ఆపరేటివ్‌ సొసైటీ విశ్రాంత ఉద్యోగులతో  పోలింగ్‌ను నిర్వహిస్త్తున్నారు. 'మా' ఎన్నికలకు 50మంది పోలీసులతో బందో బస్తు నిర్వహిస్తున్నారు. మొదట ఈసీ మెంబర్ల ఫలితాలు, చివరికి 'మా' అధ్యక్షుడి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రాత్రి 8గంటల తర్వాత 'మా' అధ్యక్షుడి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.

07:22 October 10

Maa elections 2021

prakash raj
ప్రకాశ్​రాజ్​ ప్యానల్​

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో 'మా' ఎన్నికల పోలింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది. 'మా' అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తున్నారు. సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు 'మా' ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. 

మంచు విష్ణు-ప్రకాశ్​రాజ్​ ఆత్మీయ ఆలింగనం

పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానళ్లతో పాటు మోహన్‌బాబు తదితరులు అక్కడికి చేరుకున్నారు. పోలింగ్‌ కేంద్రం ఆవరణలో ప్రకాశ్‌రాజ్‌, మోహన్‌బాబు కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌.. మోహన్‌బాబు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం మోహన్‌బాబు.. విష్ణుతో ప్రకాశ్‌రాజ్‌కు కరచాలనం చేయించారు. తర్వాత విష్ణు-ప్రకాశ్‌రాజ్‌ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

'మా' ఎన్నికల్లో ఓటింగ్‌ ఎలా జరుగుతుందంటే?

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) కార్యవర్గాన్ని రెండేళ్లకొకసారి ఎన్నుకుంటారు. ఇందులో అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఎగ్జిక్యూటివ్ ​ప్రెసిడెంట్​, జనరల్ సెక్రటరీ, ఇద్దరు జాయింట్ సెక్రటరీలతో పాటు ట్రెజరర్, 18 మంది ఈసీ మెంబర్లతో కలిపి మొత్తం 26 మందితో అసోసియేషన్ తన కార్యకలాపాలను కొనసాగిస్తుంటుంది. వీరందరిని ఎన్నుకునేందుకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు.‘మా’ ఎన్నికల్లో ఓటింగ్‌ ప్రక్రియ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కో ఓటరు మొత్తం 26 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. పోటీ పడుతున్న ప్యానెల్ సభ్యుల్లో తమకు నచ్చిన అధ్యక్షుడితోపాటు ఉపాధ్యక్షుడు, ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, సెక్రటరీ, ఈసీ సభ్యులకు ఓటు వేయాలి. అంటే ఒక్కో ఓటరు 26 ఓట్లు వేయాలి. ఓటింగ్ ప్రక్రియలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి ఏ ప్యానెల్‌లో ఉన్నాడు, ఏ పదవికి పోటీ చేస్తున్నాడో చూసి ఓటు వేయాలి. ఈ క్రమంలో రెండు ప్యానెల్స్ మధ్య పోటీ జరిగితే ఓటరు ఎలాంటి గందరగోళం ఉండదు.

Last Updated :Oct 11, 2021, 12:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.