ETV Bharat / sitara

Kajol Coronavirus: బాలీవుడ్​ నటి​ కాజోల్​కు కరోనా

author img

By

Published : Jan 30, 2022, 3:45 PM IST

Kajol Coronavirus: బాలీవుడ్​ సీనియర్​ హీరోయిన్ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా తెలిపిన ఆమె.. తన కూతురు ఫొటోను షేర్​ చేసి ఓ ఆసక్తికర కామెంట్ పెట్టారు.

Kajol Coronavirus
కాజోల్

Kajol Coronavirus: అలనాటి బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కాజోల్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​ వేదికగా వెల్లడించారు కాజోల్.

"నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. అయితే జలుబు కారణంగా ఎర్రగా మారిన నా ముక్కును మీకు చూపించాలని అనుకోవడం లేదు. బదులుగా ఈ ప్రపంచంలోనే అత్యంత అందమైన నవ్వును చూడండి" అంటూ తన కూతురు నైసా దేవ్​గణ్​ ఫొటోను షేర్​ చేశారు కాజోల్.

Kajol Coronavirus
కాజోల్

కాజోల్..​ చివరిగా 2021లో వచ్చిన్​ నెట్​ఫ్లిక్స్​ ఫ్యామిలీ డ్రామా 'త్రిభంగ'లో అలరించారు. ఆమె భర్త, బాలీవుడ్ స్టార్​ హీరో అజయ్ దేవ్​గణ్​ కూడా వెబ్​సిరీస్​లో అరంగేట్రం చేశారు. ఆయన నటించిన 'రుద్ర' సిరీస్​ ట్రైలర్​ ఇటీవలే విడుదలై ఆకట్టుకుంటోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అవంతిక రూటే సెపరేటు.. ఆ వెబ్ సిరీస్​తో ఎంట్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.