ETV Bharat / sitara

నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకెళ్తా: అనసూయ

author img

By

Published : Oct 12, 2021, 10:54 PM IST

Jabardasth Anchor Anasuya Fires On Social Media People
నాపై తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా: అనసూయ

యూట్యూబ్​ ఛానల్స్​పై యాంకర్​ అనసూయ భరద్వాజ్​ మండిపడ్డారు. తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని స్పష్టం చేశారు. ఎవరి జీవితాన్ని వారు జీవించనివ్వాలని హితవు పలికారు.

తనను సంప్రదించకుండా తనపై తప్పుడు వార్తలు రాసే వాళ్లపై కోర్టుకెళతానని సినీ నటి, యాంకర్‌ అనసూయ మండిపడ్డారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా తొలుత ఆమె విజయం సాధించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు మరుసటి రోజుకు వాయిదా వేయడం వల్ల ఆమె ఫలితంపై సందిగ్ధత నెలకొంది. మరుసటి రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో అనసూయ ఓడిపోయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీనిపై అనసూయ కూడా వ్యంగ్యంగా ట్వీట్‌ పెట్టారు. మంగళవారం ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి విజయం సాధించిన సభ్యులు రాజీనామా చేయగా.. ఈ ప్రెస్‌మీట్‌కు వచ్చిన అనసూయ విలేకరులతో మాట్లాడారు. యూట్యూబ్‌ ఛానళ్లు ఇష్టమొచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి జీవితాన్ని వారు జీవించనివ్వాలని హితవు పలికారు.

"నేను మెజార్టీలో ఉన్నానని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. నేను మీడియాలో ఉంటే న్యూస్‌ రిపోర్ట్‌ చేయడాన్ని ఎంచుకుంటాను. క్రియేట్‌ చేయను. గాలి వార్తలు చెప్పను. కచ్చితంగా ఎన్నికల అధికారులు ప్రకటిస్తేనే చెబుతాను. ఓట్ల లెక్కింపు దగ్గర ఎవరో ఇచ్చిన సమాచారాన్ని నేను నమ్మను. 'మా' ఎన్నికల్లో గెలిచి ఉంటే, మరింత సర్వీస్‌ చేసేదాన్ని. ఇప్పుడు కూడా సమయం ఉంటే తప్పకుండా చేస్తా. గెలుపోటములు పట్టించుకోను. వరుస షూటింగ్‌ల కారణంగా గత 40 రోజులుగా సరిగా ఇంటికి వెళ్లలేకపోయాను. పని నుంచి నేరుగా వచ్చి ఓటేశాను. ఆ తర్వాత అక్కడే ఉన్నాను. ప్రెసిడెంట్‌ ఓట్ల లెక్కింపు మొదలు పెట్టకుండానే ఫలితాలను మీడియా ప్రకటించింది. నేను చాలా ధైర్యవంతురాలిని. ఓడిపోయానని ఎదుటవాళ్లు చెబితే ఒప్పుకొనే దాన్ని కాదు. నా గురించి తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే కోర్టుకు వెళ్తా" అని అనసూయ అన్నారు.

ఇదీ చూడండి.. ప్రకాశ్​రాజ్​ ప్యానల్​ కీలక ప్రకటన తర్వాత విష్ణు ఏం చేయనున్నారు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.