ETV Bharat / sitara

మెగాస్టార్ సినిమాలో విలన్​గా ఛాన్స్ వస్తే?.. కార్తికేయ క్రేజీ ఆన్సర్

author img

By

Published : Feb 21, 2022, 4:16 PM IST

Chiranjeevi karthikeya: చిరు సినిమాలో విలన్​గా అవకాశమొస్తే నటిస్తారా అనే ప్రశ్నకు కార్తికేయ క్రేజీ సమాధానమిచ్చారు. ప్రతినాయకుడిగా కాకపోయినా మంచి రోల్​ చేయాలని ఉందని కార్తికేయ చెప్పారు.

Chiranjeevi Hero Karthikeya
చిరంజీవి కార్తికేయ

Karthikeya valimai: యువ నటుడు కార్తికేయ.. తమిళంలో విలన్​గా చేసిన తొలి సినిమా 'వలిమై'. తెలుగులోనూ ఈ చిత్రం ఫిబ్రవరి 24న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్​లో చిత్రబృందం బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఆసక్తికర విషయాలు చెప్పారు.

'ఈ సినిమా చూసి మీ అభిమాన హీరో చిరంజీవి మీకు ఫోన్ చేసి, తన సినిమాలో విలన్​గా చేయమంటే చేస్తారా?' అని కార్తికేయను ప్రశ్నించగా.. 'మెగాస్టార్ సినిమాల్​ విలన్​గా చేయగలుగుతానా లేదా అనేది నా డౌట్. విలన్​గా అంటే ఆయనకు ఎదురుగా నిలబడి డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆయనను చూడగానే కిందా మీదా అవుతాను. ఇక పెర్ఫార్మెన్స్​కు అవకాశం ఎక్కడుంటుంది. విలన్​గా కాకపోయినా ఆయన సినిమాలో ఓ మంచి రోల్ చేయాలని ఉంది. నా అభిమాన హీరోతో ఓ సినిమా చేశాననే సంతోషం, సంతృప్తి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అలాంటి అవకాశం కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను' అని కార్తికేయ చెప్పుకొచ్చారు.

'ఆర్ఎక్స్ 100' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. ఆ తర్వాత నాని 'గ్యాంగ్​లీడర్'లో ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఈ క్రమంలోనే అజిత్​ 'వలిమై' విలన్​గా చేసే అవకాశమొచ్చింది. ఓ వైపు హీరోగా చేస్తూనే, నెగిటివ్​ పాత్రల్లోనూ కనిపిస్తూ కార్తికేయ ఆకట్టుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.