ETV Bharat / sitara

నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం

author img

By

Published : Mar 11, 2020, 8:59 AM IST

నేటి(బుధవారం) నుంచి ఈ నెలాఖరు వరకు, కేరళలోని సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. కొచ్చిలో మంగళవారం సినీ సంస్థల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నేటి నుంచి థియేటర్లు బంద్.. కరోనానే కారణం
సినిమా థియేటర్

చాలా దేశాల్లో తన ప్రభావం చూపిస్తున్న కరోనా.. భారత్​ను కలవరపెడుతోంది. ప్రస్తుతం కేరళలో ఈ వైరస్​ బాధితుల సంఖ్య 15కు చేరింది. ఈ నేపథ్యంలో అక్కడి థియేటర్లు.. నేటి నుంచి ఈ నెలాఖరు వరకు మూసివేయనున్నారు. వివిధ మలయాళ సినీ సంస్థల మధ్య కొచ్చిలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

థియేటర్లతో పాటు విద్యా వ్యవస్థపైనా కరోనా ప్రభావం పడింది. కేరళలోని సీబీఎస్​ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లోని 1-7 తరగతులకు సెలవు ప్రకటించారు అధికారులు. అయితే 8,9,10 తరగతులతో పాటు మాధ్యమిక విద్యకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కళాశాలలు మూతపడనున్నట్టు స్పష్టం చేశారు.

ఇది చదవండి: కరోనాతో అక్కడి థియేటర్లు, పాఠశాలలు బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.