'మా'కు పోటీగా మరో అసోసియేషన్​ అంటూ ప్రచారం!

author img

By

Published : Oct 12, 2021, 3:01 PM IST

Updated : Oct 12, 2021, 8:50 PM IST

Another association to be establish in Tollywood to compete with the Movie Artists Association?

మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​ ఎన్నికలు ముగిసినా సభ్యుల మధ్య నెలకొన్న భేదాభిప్రాయలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే 'మా' సభ్యత్వానికి ప్రకాశ్​ రాజ్​, నాగబాబు రాజీనామా చేయగా.. ఇప్పుడు 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ నుంచి గెలిచిన సభ్యులూ ఇదే బాట పట్టనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అందులో నిజమెంతో తెలియరాలేదు.

తెలుగు చిత్రసీమలో 'మా' ఎన్నికల నేపథ్యంలో నెలకొన్న అభిప్రాయభేదాలు.. ఎన్నికలు ముగిసినా సద్దుమణగడం లేదు. 'మా' ఎన్నికల తర్వాత తమ సభ్యత్వానికి ప్రకాశ్​ రాజ్​, నాగబాబు రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​లో తలెత్తిన ప్రాంతీయభావం క్రమంలో ఇకపై తాము అసోసియేషన్​లో సభ్యులుగా కొనసాగలేమని తేల్చి చెప్పారు.

అయితే 'మా' ఎన్నికల్లో ప్రకాశ్​ రాజ్​ ప్యానెల్​ తరపున పోటీపడి గెలిచిన సభ్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. వీరంతా 'మా'ను వీడనున్నారని టాలీవుడ్​లో జోరుగా ప్రచారం జరుగుతోంది. 'మా'కు పోటీగా మరో అసోసియేషన్​ ఏర్పాటు చేసిన దానికి 'ఆత్మ'(ఆల్​ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్​ అసోసియేషన్​) అని పేరు పెట్టనున్నారని టాలీవుడ్​లో ప్రచారం జరిగింది. అయితే అందులో నిజమెంతో తెలియరాలేదు.

ఇదీ చూడండి.. అందుకే బ్యాన్ చేశారు.. 'ఆగడు' వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందన

Last Updated :Oct 12, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.