ETV Bharat / sitara

'పుష్ప' 50 డేస్.. కళ్లు చెదిరే రేంజ్​లో కలెక్షన్లు

author img

By

Published : Feb 4, 2022, 7:04 PM IST

Allu arjun pushpa: బన్నీ 'పుష్ప' చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో ఎంత కలెక్షన్లు సాధించిందనే విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది.

allu arjun pushpa
అల్లు అర్జున్ పుష్ప

Pushpa movie collection: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో సెన్సేషన్ సృష్టించారు. తొలిసారి పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని పలకరించి, రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించారు. 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని చెప్పిన నిర్మాణ సంస్థ.. పోస్టర్​ను రిలీజ్ చేసింది.

pushpa 50 days collection
'పుష్ప' 50 డేస్ పోస్టర్

ఎలాంటి పబ్లిసిటీ లేకుండా హిందీలో రిలీజైన 'పుష్ప' సినిమా.. అక్కడి అభిమానులకు తెగ నచ్చేసింది. ఎంతలా అంటే కొన్నాళ్లకు చిత్రం ఓటీటీలో రిలీజైనా సరే హిందీ ఆడియెన్స్, థియేటర్లకు వెళ్లి మరీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది.

శేషాచలం ఎర్రచందనం నేపథ్య కథతో తీసిన ఈ సినిమాలో బన్నీ.. స్మగ్లర్​గా నటించారు. రష్మిక హీరోయిన్​గా చేసింది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

'పుష్ప' రెండో భాగం షూటింగ్ త్వరలో మొదలుకానుంది. ఈ ఏడాది డిసెంబరులో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.