ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో మూడు టిక్కుల ఫీచర్​.. నిజమెంత?

author img

By

Published : Jan 4, 2022, 5:29 PM IST

WhatsApp New Feature: వాట్సాప్​కు సంబంధించిన ఓ ఫీచర్​ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతుంది. అదే మూడు బ్లూ టిక్​లు. అవతలి వ్యక్తి మన చాట్​, ప్రైవేట్​ వీడియోలు, ఫొటోలను స్క్రీన్​ షాట్​ తీస్తే.. వాట్సాప్​ అలర్ట్​గా వెంటనే మూడు టిక్కులు చూపించనుందని తెలుస్తోంది. అయితే ఇందులో నిజమెంత అనేది తెలుసుకుందాం.

WhatsApp New Feature
వాట్సాప్​లో మూడు టిక్కుల ఫీచర్​

WhatsApp New Feature: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకువస్తోందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవతలి వ్యక్తి మన మెసేజ్​లు, మనం పంపిన ప్రైవేట్​ వీడియోలు, ఫొటోలను స్క్రీన్​ షాట్​ తీస్తే.. వెంటనే అలర్ట్​గా మూడు టిక్కులు కనిపిస్తాయన్నది ఆ వార్తల సారాంశం. అంతేగాకుండా ఈ ఫీచర్​ను పరీక్షించి త్వరలోనే వాట్సాప్​ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు న్యూస్​ తెగ వైరల్​ అయ్యింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవం అని వాట్సాప్ వివరాలను ఎప్పటికప్పుడు లీక్​ చేసే వెబ్​ బీటా ఇన్ఫో తెలిపింది.

సాధారణంగా వాట్సాప్​లో మనం ఎవరికైనా మెసేజ్​ చేస్తే... డెలివరీ కాకపోతే ఒక బూడిద రంగు టిక్​ కనిపిస్తుంది. అదే డెలివరీ అయితే రెండు టిక్​ సింబల్స్​ అదే రంగులో కనిపిస్తాయి. ఒక వేళ మనం పంపిన మెసేజ్​ను ఎదుటి వ్యక్తి చూస్తే.. ఆ రెండు టిక్​ సింబల్స్​ కాస్తా నీలి రంగులోకి మారిపోతాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే. వీటికి తోడు.. మన చాట్​ను, మీడియాను స్క్రీన్​ షాట్​ తీస్తే.. మనకు తెలిసేందుకు వాట్సాప్​ మూడో టిక్​ సింబల్​ను తీసుకురానున్నట్లు గాసిప్స్​ వినిపించాయి.

వాస్తవానికి ఇలాంటి ఫీచర్​ ఇతర యాప్​ల్లో అందుబాటులో ఉంది. యువత ఎక్కువగా ఉపయోగించే స్నాప్​చాట్​, ఇన్​స్టాగ్రామ్ డీఎం వానిష్​ మోడ్​లలో ఎదుటి వ్యక్తి స్క్రీన్​ షాట్​ తీస్తే మనకు తెలిసే ఫీచర్​ ఉంది. నిజానికి ఈ ఫీచర్​ను వివిధ కారణాల వల్ల వాట్సాప్​ తీసుకురాలేదు. కాబట్టి ఈ వార్తలు అవాస్తవం. అయితే వాట్సాప్​ త్వరలో కాంటాక్ట్​ ఇన్ఫో పేరుతో మరో ఫీచర్​ను తీసుకురానున్నట్లు తెలిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే.. లోకల్​ బిజినెస్​కు మరింత ఊతం కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఇవీ చూడండి:

Online Addiction: కొత్త ఏడాదిని 'స్మార్ట్‌'గా గడిపేద్దాం.. రండి!

Apple Display Technology: ఐఫోన్‌లో కొత్త ఫీచర్‌.. ఫోన్‌ డిస్​ప్లేతో ఛార్జింగ్

ఐఫోన్​ 12 మినీపై సూపర్​ కూల్​ ఆఫర్​.. రూ.50వేల లోపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.