ETV Bharat / science-and-technology

మనిషిని మోసుకెళ్లే 'వరుణ' డ్రోన్ రెడీ.. మూడేళ్లలో ఎయిర్​ ట్యాక్సీలు రయ్​రయ్​!

author img

By

Published : Aug 8, 2022, 2:00 PM IST

varuna drone india
మనిషిని మోసుకెళ్లే 'వరుణ' డ్రోన్ రెడీ.. మూడేళ్లలో ఎయిర్​ ట్యాక్సీలు రయ్​రయ్​!

Varuna Drone India : మనిషిని మోసుకెళ్లగల సామర్థ్యంతో అధునాతన 'వరుణ' డ్రోన్​ను రూపొందించినట్లు ప్రకటించింది పుణెకు చెందిన ఓ సంస్థ. వైద్యపరంగా అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి రోగుల్ని తరలించేందుకు ఈ డ్రోన్​ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది.

Drone taxi India : మనిషిని మోసుకెళ్లగల 'వరుణ' డ్రోన్​ పనితీరుపై ఆదివారం డెమో ఇచ్చింది మహారాష్ట్ర పుణెకు చెందిన ఓ సంస్థ. రక్షణ ఉత్పత్తులు తయారు చేసే సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్.. ఈ డ్రోన్​ను రూపొందించింది. ఈ అటానమస్​ మల్టీకాప్టర్ డ్రోన్.. వస్తువుల్ని, మనిషిని మోసుకెళ్లగలదని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.

Varuna drone company : "ఈ డ్రోన్.. 130 కిలోల బరువు మోయగలదు. కదులుతున్న నౌకపై నుంచి బరువును ఎత్తుకుని.. మరో ఓడపై దించగలదు. ఈ డ్రోన్​ రక్షణ దళాలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. మనుషుల రవాణాకు ఈ డ్రోన్​ను వాడొచ్చు. వైద్యపరంగా అత్యవసర పరిస్థితులు తలెత్తితే గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఆస్పత్రికి తరలించవచ్చు. రోడ్డుతో పోల్చితే వాయు మార్గంలో ప్రయాణ దూరం మూడు రెట్లు తక్కువ. అంటే.. విలువైన సమయం ఆదా అవుతుంది. రోడ్డు ద్వారా ప్రయాణానికి గంట పడితే.. డ్రోన్ ద్వారా 15-20 నిమిషాల్లో చేరుకోవచ్చు. రానున్న 3-4 ఏళ్లలో ఈ డ్రోన్​ను ఎయిర్ ట్యాక్సీగానూ ఉపయోగించవచ్చు" అని తెలిపారు సాగర్ డిఫెన్స్​ ఇంజినీరింగ్ సంస్థ సహవ్యవస్థాపకుడు మృదుల్ బబ్బర్.

డ్రోన్లను ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగించడంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. సమయాన్ని, ఖర్చును ఆదా చేసే డ్రోన్‌ ట్యాక్సీలను గతేడాది దక్షిణ కొరియా విజయవంతంగా పరీక్షించింది. వీటిని 2025 నాటికి ప్రజలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ముమ్మర యత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.