ETV Bharat / science-and-technology

Twitter Audio Video Call Feature : ట్విట్టర్​లో ఆడియో, వీడియో కాలింగ్​ ఫీచర్​.. కేవలం వారికి మాత్రమే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 26, 2023, 4:21 PM IST

Twitter Audio Video Call Feature : మరికొద్ది రోజుల్లో ఎక్స్​(ట్విటర్​)లో ఆడియో, వీడియో కాలింగ్​​ ఫీచర్​ రానుంది. అయితే కాలింగ్ సౌకర్యం అందరికి అందుబాటులో ఉండకపోచ్చనే సమాచారం ఉంది. మరి ట్విట్టర్ కాలింగ్​ ఫీచర్​ ఎవరికి అందుబాటులో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా?

Twitter Audio Video Call Feature
ట్విట్టర్​ ఆడియో, వీడియో కాల్

Twitter Audio Video Call Feature : ట్విట్టర్​ (ఎక్స్​)ను స్వాధీనం చేసుకున్నప్ప​టి నుంచే.. ఆ సంస్థలో భారీ మార్పులకు స్వీకారం చుట్టారు ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్.​ సరికొత్త ఫీచర్లను యాప్​​లో ప్రవేశపెడుతూ.. తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని ఫీచర్లను యాప్​లో అందుబాటులోకి తీసుకురాగా.. మరికొన్ని ప్రయోగదశలో ఉన్నాయి. ట్విటర్​ సబ్​స్క్రిప్షన్​కు సైతం వినియోగదారుల నుంచి నెమ్మదిగా ఆదరణ పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని ఫీచర్లను యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతోంది ట్విట్టర్. దాంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఆడియో, వీడియో కాల్​ ఫీచర్​ గురించి.

ఆడియో, వీడియో కాల్ ఫీచర్​పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ట్విట్టర్​లో ఆడియో, వీడియో కాల్​కు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఆ సంస్థ సీఈఓ లిండా యాకరినో ఓ ప్రకటన విడుదల చేశారు. త్వరలోనే ఎక్స్​ ప్లాట్​ఫారమ్​లో వీడియో కాలింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెస్తున్నట్లు అప్పుడే అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్​ వచ్చిన తరువాత యూజర్లు తమ ఫోన్ నంబర్​ను ఇతరులతో పంచుకోకుండానే వీడియో కాలింగ్ చేసుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు. కాగా మరికొద్ది రోజుల్లోనే ఈ ఫీచర్​ను యాప్​లో తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది ట్విట్టర్ యాజమాన్యం.

ప్రముఖ టెక్​ నిపుణులు క్రిస్ మెస్సినా దీనికి సంబంధించి మరో వార్త అందించారు. ఎక్స్​(ట్విట్టర్)​లో ఆడియో, వీడియోలకు సపోర్ట్​ చేసే.. ఓ కోడ్​ ఆయన రివీల్ చేశారు. కొద్ది రోజుల్లోనే ఆడియో, వీడియో కాల్ ఫీచర్​ను ఎక్స్​ ప్లాట్​ఫారమ్​లో(ట్విట్టర్)​లో ప్రవేశపెట్టనున్నట్లు క్రిస్ మెస్సినా ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్​(ట్విట్టర్)​ సీఈఓ లిండా యాకరినో నుంచి సూచనలు అందినట్లు కూడా ఆయన వివరించారు.

వీరికే మాత్రమే ఆడియో, వీడియో కాల్ ఫీచర్​..
Audio Video Call Feature on Twitter : ట్విట్టర్ ఆడియో, వీడియో కాల్​ ఫీచర్​ కేవలం ప్రీమియం, సబ్​స్క్రిప్షన్-ఓన్లీ​ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా​ వెరిఫైడ్​ ట్విటర్​ యూజర్లకు మాత్రమే కాలింగ్​ సపోర్ట్ ఉంటుందని సమాచారం. కాల్​ స్వీకరించే వ్యక్తి.. కాల్ చేసే వారిని ఫాలో అయినప్పుడే ఈ ఫీచర్​ సపోర్ట్​ చేస్తుందని తెలుస్తోంది.

X Job Hiring Feature : మీకు నచ్చిన జాబ్ కోసం వెతకడం, అప్లై చేయడం ఇక మరింత ఈజీ.. ఎలాగంటే?

Twitter Ad Revenue Sharing : ట్విట్టర్​ యూజర్లకు మస్క్​ బంపర్​ ఆఫర్​.. బ్లూ టిక్​తో వేలాది డాలర్ల సంపాదన!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.