ETV Bharat / science-and-technology

గూగుల్​ బార్డ్​లో అదిరిపోయే ఫీచర్స్​.. ఎలా వాడాలో తెలుసా?

author img

By

Published : Jun 12, 2023, 3:33 PM IST

Google Bard Features : ఏఐ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గూగుల్ బార్డ్​ ఇప్పుడు భారత దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఈ లేటెస్ట్​ 'బార్డ్​ ఏఐ'లో సూపర్ ఫీచర్స్​ ఉన్నాయి. త్వరలో మరెన్నో ఫీచర్స్​ అందుబాటులోకి రానున్నాయి. మరి దీనిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందామా?

google bard AI available in India
google bard AI features

Google Bard AI Features : గూగుల్​ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'గూగుల్​ బార్డ్​ ఏఐ' ఇప్పుడు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 180 దేశాల్లో దీనిని ప్రవేశపెట్టింది గూగుల్​.

"మేము గూగుల్​ బార్డ్​ను 180 దేశాల్లో అందుబాటులోకి తెచ్చాం. అందులో భాగంగా భారతదేశంలోనూ దీనిని ప్రవేశపెట్టాం. ఈ సరికొత్త ఏఐ బార్డ్​లో మరిన్ని సరికొత్త ఫీచర్లను తీసుకువస్తాం. దీనిని ప్రజలు అందరూ ఉపయోగించి, తమ విలువైన ఫీడ్​బ్యాక్​ను మాకు అందిస్తారని ఆశిస్తున్నాం."
- గూగుల్​

గూగుల్​ బార్డ్​ను ఎలా యాక్సెస్​ చేయాలి?
ముందుగా మీరు bard.google.com కు వెళ్లాలి. 'ప్రస్తుతం ఈ చాట్​బాట్​ టెస్టింగ్​ దశలోనే ఉంది.' అనే మెసేజ్ మీకు కనిపిస్తుంది. మీరు 'ట్రై బార్డ్​'పై క్లిక్​ చేయాలి. తరువాత కంపెనీ ప్రైవసీ పాలసీపై క్లిక్​ చేసి దానిని యాక్సెప్ట్​ చేయాలి. అంతే మీరు బార్డ్​ ఏఐని ఉపయోగించుకోవచ్చు.

ప్రయోగదశలోనే ఉంది!
ప్రస్తుతం బార్డ్​ ఏఐ అనేది ఇంకా ప్రయోగ​ దశలోనే ఉంది. అందుకే గూగుల్​ బార్డ్​ మీకు చూపించే సమాచారం.. కొంత మేరకు అసంబద్ధంగా లేదా అభ్యంతరకరంగా ఉండొచ్చు.

అనేక భాషలను సపోర్ట్​ చేస్తుంది!
గూగుల్​ బార్డ్​ ప్రస్తుతం ఆంగ్లంతోపాటు జపనీస్​, కొరియన్​ భాషలను సపోర్ట్ చేస్తుంది. త్వరలోనే మరో 40 భాషల్లోకి ఈ ఏఐ చాట్​బాట్​ను అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్​ సమాయత్తమవుతోంది.

గూగుల్​ బార్డ్​ - అప్​కమింగ్​ ఫీచర్స్​
గూగుల్​ తన సరికొత్త ఏఐ బార్డ్​లో.. టెక్ట్స్​తో పాటు విజువల్​ అంటే చిత్రాల రూపంలో సమాచారాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.

  • ఉదాహరణకు మీరు తాజ్​మహల్​ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు బార్డ్​ ఏఐ.. తాజ్​మహల్​ గురించి అక్షర రూపంలోని సమాచారంతోపాటు..తాజ్​మహల్​ చిత్రాలను కూడా మీకు అందిస్తుంది. దీని వలన మీరు ఏ విషయం గురించి వెదుకుతున్నారో.. దాని గురించి మరింత స్పష్టమైన సమాచారం మీకు అందుతుంది అని గూగుల్ తెలిపింది.

యూజర్లు కూడా తమ దగ్గర ఉన్న ఇమేజ్​లను ఉపయోగించి, బార్డ్​ చాట్​బాట్​లో సెర్చ్​ చేయవచ్చు. దాని కోసం మీరు మీ గూగుల్​ లెన్స్​ను బార్డ్​కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

  • ఉదాహరణకు మీ దగ్గర రెండు కుక్కల చిత్రాలు ఉన్నాయి. వాటిని గూగుల్​ బార్డ్​ సెర్చ్​లో ఉంచి, మంచి హాస్యభరితమైన క్యాప్షన్​ను సూచించాలని కోరవచ్చు. అప్పుడు బార్డ్​ ఏఐ.. ఆ చిత్రాలను విశ్లేషించి, అవి ఏ జాతి కుక్కలో కూడా తెలుసుకుని, వాటికి తగినట్లుగా మంచి క్యాప్షన్​ను ఇస్తుంది. అది కూడా కేవలం కొన్ని సెకెన్లలోనే.
    • Bard is an experimental conversational AI service, powered by LaMDA. Built using our large language models and drawing on information from the web, it" s="" a="" launchpad="" for="" curiosity="" and="" can="" help="" simplify="" complex="" topics="" →="" https://t.co/fSp531xKy3 pic.twitter.com/JecHXVmt8l

      — Google (@Google) February 6, 2023 ' class='align-text-top noRightClick twitterSection' data=' '>

గూగుల్ ప్రొడక్టులతో బార్డ్​ అనుసంధానం!
ఇప్పటికే గూగుల్​ తన బార్డ్​ ఏఐని డాక్స్​, డ్రైవ్​, జీమెయిల్, మ్యాప్స్​తో సహా అన్ని గూగుల్​ ప్రొడక్టులకు అనుసంధానం చేసింది. దీనితోపాటు అడోబ్​ ఫైర్​ఫ్లైతో కూడా బార్డ్​ను అనుసంధానం చేసి, మంచి చిత్రాలను జనరేట్​ చేయవచ్చు. అయితే బార్డ్​ను ఉపయోగించడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదని గూగుల్​ చెబుతోంది.
ప్రస్తుతం అంతర్జాలంలో ఉన్న అన్ని సేవలను కూడా బార్డ్​ మీకు అందించగలదు. అలాగే ఎక్స్​టెన్షన్​లను కూడా దీనికి మీరు అనుసంధానం చేసుకోచ్చు. దీని వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా మరింత సృజనాత్మకమైన సేవలు మీరు పొందవచ్చు అని గూగుల్ చెబుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.