ETV Bharat / science-and-technology

Chandrayaan 3 : జాబిల్లిపై 14 రోజులపాటు విక్రమ్, ప్రగ్యాన్​.. అక్కడ అసలు ఏం చేస్తాయి?

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 1:56 PM IST

Chandrayaan 3 Lander And Rover : చంద్రయాన్‌ మిషన్‌లో భాగంగా ఇస్రో పంపిన విక్రమ్‌ ల్యాండర్, ప్రగ్యాన్‌ రోవర్‌.. జాబిల్లిపై 14 రోజుల పాటు పరిశోధనలు నిర్వహించనున్నాయి. సౌరశక్తి సాయంతో జాబిల్లిపై వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను అవి నిశితంగా శోధిస్తాయి. ఈ రెండింటిలో ఇస్రో ఏ ఏ పరికరాలు అమర్చింది, అవి ఏ ఏ పనులు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

chandrayaan 3 lander and rover
chandrayaan 3 lander and rover

Chandrayaan 3 Lander And Rover : చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌, ప్రగ్యాన్‌ రోవర్‌ జాబిల్లి దక్షిణ ధ్రువంపై సురక్షితంగా దిగితే అక్కడి వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను నిశితంగా శోధిస్తాయి. జాబిల్లిపై పరిశోధనలు చేయడానికి శాస్త్రీయ పేలోడ్లను ఇస్రో వాటిలో అమర్చింది. ల్యాండర్‌, రోవర్‌ జీవిత కాలం 14 రోజులు. చంద్రునిపై పగలు అంటే భూమిపై 14 రోజులతో సమానం. అందుకే సూర్యరశ్మి ఉండే 14 రోజులు సౌరఫలకాల సాయంతో శక్తి సమకూర్చుకుని ల్యాండర్‌, రోవర్‌ పరిశోధనలు నిర్వహిస్తాయి.

విక్రమ్​ ల్యాండర్​లో నాలుగు..
Lander Vikram Weight : విక్రమ్‌ ల్యాండర్‌ బరువు ప్రగ్యాన్‌ రోవర్‌తో కలిపి 1749.8 కిలోలు. విక్రమ్‌ ల్యాండర్‌లో నాలుగు శాస్త్రీయ పేలోడ్లు ఉన్నాయి. రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్సెన్సిటివ్ అయానోస్పియర్ అండ్‌ అట్మాస్పియర్ అంటే రాంభా పేలోడ్‌.. సమీప ఉపరితల ప్లాస్మా అంటే అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రతను కొలుస్తుంది.

Lander Vikram And Rover Pragyan : ఇక చంద్రాస్‌ సర్ఫేస్‌ థర్మో ఫిజికల్‌ ఎక్స్‌పరిమెంట్‌.. చాస్టే అనే పేలోడ్‌.. జాబిల్లి దక్షిణ ధ్రువం సమీపంలోని ఉపరితలం ఉష్ణ లక్షణాల కొలతలను నిర్వహిస్తుంది. ఇన్‌స్ట్రుమెంట్‌ ఫర్‌ లూనార్‌ సీస్మిక్‌ యాక్టివిటీ ILSA...ల్యాండింగ్ ప్రాంతం చుట్టూ భూకంప చర్యలను కొలుస్తుంది.

జాబిల్లి వ్యవస్థ..
Lander Rover Orbiter : చంద్రుని ఉపరితలం, ఆవరణ నిర్మాణాన్ని వివరిస్తుంది. లేజర్ రెట్రో రిఫ్లెక్టర్ అర్రే.. LRA.. జాబిల్లి వ్యవస్థ గతిశాస్త్రం తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. విక్రమ్‌ ల్యాండర్‌లో ఏడు సెన్సార్లు ఉంటాయి. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్‌ అవాయిడెన్స్ కెమెరా కూడా ఇందులో భాగంగా ఉంటుంది.

chandrayaan 3 lander and rover
చంద్రయాన్-3 ల్యాండర్​, రోవర్​

Rover Pragyan Weight : 26 కిలోల బరువుండే ప్రగ్యాన్‌ రోవర్‌లో ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌-రే స్పెక్టోమీటర్‌...APXS, లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌...LIBS ఉంటాయి. ల్యాండింగ్‌ ప్రాంతం చుట్టూ ఉన్న నేల, రాళ్లలోని మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, పొటాషియం, కాల్షియం, టైటానియం, ఐరన్ వంటి మౌలిక కూర్పును APXS నిర్ణయిస్తుంది. గుణాత్మక, పరిమాణాత్మక మౌళిక విశ్లేషణకు, చంద్రుని ఉపరితలంపై మన అవగాహనను మరింతగా పెంచుకోవడానికి, రసాయన కూర్పును, ఖనిజ సంబంధమైన కూర్పును ఊహించడంలో LIBS సహాయపడుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.