ETV Bharat / international

Vivek Ramaswamy On H1B Visa : నేను ప్రెసిడెంట్​ అయితే.. H1B వీసాలు ఎత్తేస్తా : వివేక్ రామస్వామి

author img

By PTI

Published : Sep 17, 2023, 4:59 PM IST

Updated : Sep 17, 2023, 5:30 PM IST

Vivek Ramaswamy On H1B Visa : తాను అధ్యక్షుడిని అయితే హెచ్​1బీ వీసాలను ఎత్తేస్తానని రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్‌ రామస్వామి ప్రకటించారు. దీని స్థానంలో మెరిట్​ అధారిత విధానం తీసుకొస్తానని చెప్పారు. హెచ్​1బీ విధానాన్ని 'ఒప్పంద దాస్యం'గా అభివర్ణించారు.

Vivek Ramaswamy Comments On H1B Visa
Vivek Ramaswamy Comments On H1B Visa

Vivek Ramaswamy On H1B Visa : తన ప్రసంగాలతో, సరికొత్త ప్రకటనలతో ప్రతిరోజు వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా రిపబ్లికన్​ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వ ఆశావహుడు, భారత సంతతి అమెరికన్ వివేక్​ రామస్వామి. తాజాగా.. తాను అధ్యక్షుడిని అయితే హెచ్​1బీ వీసా లాంటి లాటరీ ఆధారిత విధానాన్ని ఎత్తేసి.. దాని స్థానంలో మెరిట్​ ఆధారిత విధానాన్ని తీసుకొస్తానని సంచలన ప్రకటన చేశారు. ఇక ప్రస్తుతమున్న హెచ్​చ్​1బీ వీసా విధానాన్ని 'ఇండెంట్డ్ సర్విట్యూడ్' (ఒప్పంద దాస్యం)గా అభివర్ణించారు. ఇది కేవలం దాన్ని జారీ చేసే కంపెనీకే ఎక్కువ లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఇక కుటుంబాలతో సహా వచ్చే వ్యక్తులు నైపుణ్యాలు ఉన్నవారు కాదని చెప్పారు.

H1 B Visa USA : హెచ్​1బీ వీసా అనేది.. వలసదారుల వీసా. ఇది అమెరికన్ కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం ఉన్న వలసదారులను నియమించుకోడానికి అనుమతిస్తుంది. హెచ్​1బీ వీసాను భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా కోరుకుంటారు. అమెరికన్ కంపెనీలు.. భారత్​, చైనా లాంటి దేశాల నుంచి ఏటా వేల సంఖ్యలో ఇలాంటి వారిని నియమించుకుంటాయి. అయితే, రామస్వామి.. తన ఫార్మా కంపెనీ రోవాంట్​ సైన్సెస్ కోసం ఉద్యోగులను నియమించుకోడానికి 29 సార్లు H1B వీసాను ఉపయోగించుకున్నారు.

ఏటేటా హెచ్​1బీకి పెరుగుతున్న డిమాండ్..
హెచ్​1బీ వీసాల కోసం ఏటేటా భారీ డిమాండ్​ ఏర్పడుతోన్న నేపథ్యంలో.. వివేక్​ వ్యాఖ్యలు చర్చనియాంశమయ్యాయి. 2021 గణాంకాల ప్రకారం, అక్కడ 85వేల మందికి అవకాశం ఉండగా.. సుమారు 8లక్షల దరఖాస్తులు వచ్చాయి. ప్రతి సంవత్సరం ఇచ్చే 85 వేలల్లో 65 వేలు అందరికీ అందుబాటులో ఉంటుండగా.. 20 వేల వీసాలు మాత్రం అమెరికాలో ఉన్నత చదువులు చదివిన వారే పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఈ వీసాలపై కఠిన వైఖరి అవలంబించిన డొనాల్డ్‌ ట్రంప్.. వీటి సంఖ్యను నిరోధించే ప్రయత్నం చేశారు.

'నిజం'తో వివేక్​ సంచలనాలు..
Vivek Ramaswamy Presidential Campaign : వికేక్​ రామస్వామి ఇటీవల పలుమార్లు ఇలాంటి సంచలన ప్రకటనలు చేశారు. తాను అధికారంలోకి వస్తే 75శాతం ఉద్యోగులను తొలగిస్తానని.. ఫెడెరల్ బ్యూరో ఆఫ్​ ఇన్​వెస్టిగేషన్- ఎఫ్‌బీఐని మూసివేస్తానని ఇటీవల పేర్కొన్నారు. దీంతో పాటు వాతావరణం మార్పు ఎజెండా ఒక బూటకమన్నారు. దాని ద్వారా చైనా లాంటి దేశాలు లబ్ధి పొందుతున్నాయన్నారు. కానీ అమెరికాలో మాత్రం నిరుద్యుగం పెరుగుతోందని చెప్పారు. ఇలా 'నిజం' అనే నినాదంతో సంచలన ప్రసంగాలు చేస్తూ అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్నారు.

Vivek Ramaswamy Polls : వైస్​ ప్రెసిడెంట్​గా పోటీకి వివేక్​ రామస్వామి ఓకే?.. ట్రంప్​ నామినేషన్​ పొందితేనే!

Vivek Ramaswamy Polls : నేను అధ్యక్షుడినైతే ట్రంప్‌ను క్షమిస్తా.. అలాంటి అమెరికా​ నాకు ఇష్టం లేదు : వివేక్ రామస్వామి

Last Updated : Sep 17, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.