ETV Bharat / international

'ప్రయోగం ఇప్పటికే సక్సెస్'.. చంద్రయాన్​-3పై అంతర్జాతీయంగా ప్రశంసలు.. పాక్​లో అలా చేయాలని డిమాండ్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 12:34 PM IST

Pakistan On Chandrayaan 3 : చంద్రయాన్​-3పై పాకిస్థాన్​ మాజీ మంత్రి ఫవాద్​ ఛౌదరీ ప్రశంసలు కురిపించారు. పాక్​ మీడియాలో 'విక్రమ్​' ల్యాండింగ్​ను ప్రసారం చేయాలని ఆయన కోరారు. మరోవైపు, ఈ ప్రయోగం విజయవంతమైనా కాకపోయినా.. అది విజయవంతమైనట్లే అని నాసా మాజీ అధికారి మైక్​ గోల్డ్​ అన్నారు.

pakistan-on-chandrayaan-3-pak-ex-minister-requests-landing-live-and-mike-gold-nasa-on-chandrayaan-3
pakistan-on-chandrayaan-3-pak-ex-minister-requests-landing-live-and-mike-gold-nasa-on-chandrayaan-3

Pakistan On Chandrayaan 3 : చందమామ దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3 ప్రయోగం తుది అంకానికి రంగం సిద్ధమైంది. జాబిల్లిపై ల్యాండింగ్​ కోసం భారతీయులతో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే మన ప్రయోగంపై పాకిస్థాన్​ ప్రశంసలు కురిపించింది. పాక్​ మాజీ మంత్రి ఫవాద్‌ ఛౌదరీ ఈ మిషన్‌ను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.

Pakistan Minister On Chandrayaan 3 : "పాకిస్థాన్​ మీడియా చంద్రయాన్‌-3 ల్యాండింగ్​ను ప్రసారం చేయాలి. మానవాళికి మరీ ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి ఇవి చరిత్రాత్మక క్షణాలు. అభినందనలు" అని ట్విట్టర్​ (ఎక్స్‌)లో రాసుకొచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ హయాంలో ఫవాద్.. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.

  • Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations

    — Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'చంద్రయాన్​-3 విజయవంతమైనట్లే'
Mike Gold Nasa On Chandrayaan 3 : మరోవైపు, ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-3 ప్రయోగంపై నాసా మాజీ అధికారి, రెడ్ వైర్​ స్పేస్​ చీఫ్​ గ్రోత్​ ఆఫీసర్​ మైక్​ గోల్డ్​.. ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయోగం ఫలితం ఎలాగున్నా.. అది విజయవంతమైనట్లే అని ఆయన అన్నారు.

"మనం నూతన శకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రయోగం.. కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. చంద్రుడిపై మన అవగాహనను పెంచుతుంది. జాబిల్లిపై మానవ వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. స్థిరమైన ఉనికిని నెలకొల్పడానికి సహాయం చేస్తుంది. ప్రస్తుతం నాసా, ఇస్రో సంయుక్తంగా భూమిపై పరిశోధనలకు NISAR వంటి ప్రాజెక్ట్స్​తో తమ దృష్టిని కేంద్రీకరించాయి. భూమిపై రాడార్​ వ్యవస్థలతో అధ్యయనం చేయబోతున్నాం. ప్రపంచంలోని వాతావరణ మార్పులను పరిష్కరించడానికి డేటాను పొందనున్నాం. భవిష్యత్తులో రోబో, మానవులను.. అంతరిక్ష అన్వేషణకు పంపనున్నాం" అని తెలిపారు.

చంద్రయాన్​-3 గురించి మాట్లాడుతున్న నాసా మాజీ అధికారి మైక్​ గోల్డ్​

Chandrayaan 3 Landing Time : భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-3 ఎటువంటి అవాంతరాలు లేకపోతే బుధవారం (ఆగస్టు 23న) చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షుడు సోమనాథ్‌ వెల్లడించారు. ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఆగస్టు 23న చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చంద్రుడిపై దిగలేకపోతే 27వ తేదీన దిగే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ పని దిగ్విజయంగా పూర్తయితే చంద్రుడిపై ల్యాండర్‌-రోవర్‌ను దింపిన ఘనత అమెరికా, రష్యా, చైనాల తరవాత భారతదేశానికే దక్కుతుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.