బాడీ నుంచి ఊడిపోయిన పురుషాంగం.. ఆరేళ్లుగా చేతికి అంటించుకొని...

author img

By

Published : May 8, 2022, 4:03 PM IST

Man penis arm

Man with penis on arm: న్యూయార్క్​కు చెందిన ఓ వ్యక్తికి పురుషాంగం శరీరం నుంచి ఊడిపోయింది. ఇన్ఫెక్షన్ వల్ల బాడీ నుంచి అంగం వేరు అయింది. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పురుషాంగం తన చేతికే ఉండిపోవాల్సి వచ్చింది. అసలేమైందంటే?

Man with penis on arm: అసంభవం అనిపించే సంఘటన ఇది.. వైద్య చరిత్రలోనే ఊహించని పరిణామమిది.. ఓ వ్యక్తి పురుషాంగం అతడి శరీరం నుంచి ఊడిపడటం అసంభవం అనిపించేదైతే.. కృత్రిమ పురుషాంగం తయారుచేసి బాధితుడికి అమర్చడం వైద్య చరిత్రలో అరుదైన పరిణామం. వివరాల్లోకి వెళితే...

Malcolm Macdonald story: న్యూయార్క్​కు చెందిన మాల్కమ్ మాక్​డొనాల్డ్​(47)కు 2010లో అరుదైన ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ సోకి శరీరంలోని రహస్య భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ క్రమంలోనే పురుషాంగం ఊడిపోయింది. ఎంతో బాధతో వైద్యుల వద్దకు వెళ్లిన మాల్కమ్.. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నాడు. సర్జన్లు ఎంతో క్లిష్టమైన, సుదీర్ఘమైన చికిత్సకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఊడిపోయిన పురుషాంగం స్థానంలో కొత్త అంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే అంగాన్ని అతడి శరీరంపైనే పెంచాలని భావించారు. దీంతో ఎడమ చేతిపై కొత్త పురుషాంగాన్ని తయారు చేశారు.

Malcolm Macdonald penis arm: తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏంటంటే.. ఈ పురుషాంగాన్ని చేతి నుంచి తొలగించి.. సర్జరీ ద్వారా కాళ్ల మధ్యలో అమర్చడం. అయితే, ఇక్కడే మాల్కమ్​ను దురదృష్టం వెంటాడింది. సర్జరీ మొదలైనప్పటికీ.. అనివార్య కారణాలతో మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఆపరేషన్ జరుగుతుండగా.. మాల్కమ్ శరీరంలోని రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. అలాగే చికిత్స కొనసాగిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని భావించిన వైద్యులు.. సర్జరీని నిలిపివేశారు. దీంతో ఆ పురుషాంగం చేతికే ఉండిపోవాల్సి వచ్చింది.

Man penis arm
మాల్కమ్ మాక్​డొనాల్డ్

అప్పటి నుంచి మాల్కమ్ పురుషాంగాన్ని చేతికే ఉంచుకొని జీవించారు. ఈ క్రమంలోనే అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. తన చేతిని చూసినవారంతా తనను హేళన చేసేవారని మాల్కమ్ చెప్పుకొచ్చారు. "నేను ఎక్కడికి వెళ్లినా సరే.. నా చెయ్యిని చూసి దీని గురించి అడుగుతారు. చాలా మంది జోకులు వేస్తారు. కానీ, నేను దాన్ని అర్థం చేసుకోగలను. అందరికీ ఇలా చేతికే పురుషాంగం ఉండదు కదా. నాపై వేసిన జోకులను ఫన్నీగానే తీసుకున్నా. అలా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాకు ఇంకో ఆప్షన్ లేదు" అని చెప్పుకొచ్చారు మాల్కమ్.

Man penis arm
మాల్కమ్ మాక్​డొనాల్డ్

చివరకు....: మాల్కమ్ అవమానాలన్నింటికీ చెక్ పడేందుకు ఆరేళ్లకు పైగా సమయం పట్టింది. 2021లో వైద్యులు మాల్కమ్​కు రెండో శస్త్రచికిత్స నిర్వహించారు. తొమ్మిది గంటల పాటు శ్రమించి చేతికి ఉన్న పురుషాంగాన్ని.. అది ఉండాల్సిన ప్రదేశంలో అమర్చారు. ఈ సారి మాల్కమ్​కు అదృష్టం కలిసొచ్చింది. ఎలాంటి సమస్యలు లేకుండానే ఆపరేషన్ పూర్తయింది.

ఇప్పుడు తనకు సంపూర్ణ మగాడిని అన్న భావన వచ్చిందని మాల్కమ్ చెబుతున్నాడు. 'ఆపరేషన్ అయిపోయి, అంతా కుదుటపడగానే కిందకు చూసుకున్నాను. 'దేవుడా.. బతికించావు' అని అనుకున్నా. నా పాత రోజులు తిరిగొచ్చాయి' అని ఆనందంలో మునిగితేలుతున్నాడు మాల్కమ్. శృంగార జీవితం తిరిగి రాబోతోందని, అందుకు చాలా థ్రిల్లింగ్​గా ఉందని తెలిపాడు. తన సాధారణ పురుషాంగం కంటే.. కృత్రిమంగా తయారు చేసిందే చాలా మెరుగ్గా ఉందని అంటున్నాడు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.