ETV Bharat / international

'సౌదీ చారిత్రక నిర్ణయం.. అన్ని దేశాల విమానాలకు అనుమతి'

author img

By

Published : Sep 2, 2020, 7:38 PM IST

యూఏఈకి వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను తమ గగనతలం మీదగా వెళ్లేందుకు అనుమతించింది సౌదీ అరేబియా ప్రభుత్వం. యూఏఈ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.

Saudi Arabia to allow 'all countries' to fly over its skies
'అన్ని దేశాల విమాానాలు మా దేశం నుంచి వెళ్లవచ్చు'

యూఏఈకి వెళ్లే అంతర్జాతీయ విమానాలు తమ గగనతలం మీదుగా వెళ్లవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది. ఇజ్రాయెల్​-యూఏఈ ఒప్పందం జరిగిన కొన్ని రోజులకే ఈ ప్రకటన విడుదల చేయటం గమనార్హం.

ఈ ప్రకటనతో అన్ని దేశాల వాణిజ్య విమానాలు సౌదీ మీదుగా యూఏఈకి వెళ్లేందుకు మార్గం సుగమమైంది. కానీ ఇప్పటికీ నిషేధంలో ఉన్న ఇరాన్​, ఖతార్​ విమానాలకు అనుమతి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు సౌదీ.

అన్ని విమానాలను సౌదీ అనుమతించటంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్​ నేతన్యాహూ. ఇరు దేశాల మధ్య ఒప్పందానికి ఇది ఉదాహరణగా అభివర్ణించారు.

తూర్పు, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాను. అది ఇప్పటికి సాధ్యమైంది. ఇజ్రాయెల్​ విమానాలు, ఇతర అన్ని దేశాల వారు నేరుగా ఇజ్రాయెల్ నుంచి అబుధాబి, దుబాయ్​కు​ వెళ్లవచ్చు.. తిరిగిరావచ్చు.
-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి

సౌదీ నిర్ణయం వల్ల విమాన వ్యయంతో పాటు దూరం తగ్గుతుందని, అలాగే పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు ఇజ్రాయెల్​ ప్రధాని.

ఇజ్రాయెల్​-యూఏఈ ఒప్పందం అనంతరం ఈ వారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ అల్లుడు, సీనియర్​ సలహాదారు జేర్న్​ కుశ్నర్​.. ఇజ్రాయెల్​కు చెందిన ఉన్నతాధికారులతో కలిసి యూఏఈకి ప్రత్యేక విమానంతో వెళ్లారు. ఇజ్రాయెల్-యూఏఈ ఒప్పందానికి గుర్తుగా సౌదీ అరేబియా గగనతలం మీద ఈ విమానం ప్రయాణించింది.

ఇదీ చూడండి పబ్​జీ.. ఇది ఆటా లేక యమ పాశమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.