ETV Bharat / international

ప్రపంచదేశాల్లో ఆగని కరోనా ఉద్ధృతి

author img

By

Published : Sep 2, 2020, 6:58 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 2 కోట్ల 60 లక్షలకు చేరువైంది. దాదాపు 8 లక్షల 62 వేల మంది కరోనాతో మృతి చెందారు. భారత్​, అమెరికా,బ్రెజిల్, రష్యా దేశాలు సహా కొలంబియా, మెక్సికో, పెరూ, దేశాల్లోనూ కొవిడ్​ బాధితులు భారీగానే పెరుగుతున్నారు.

Global's COVID-19 cases jump to above 2 crore 59 lakh
మెక్సికోలో కరోనా ఉద్ధృతి- ప్రపంచదేశాల్లో పెరుగుతున్న కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ వ్యాప్తి నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే 2 కోట్ల 59 లక్షల 36వేల మందికిపైగా మహమ్మారి బాధితులుగా మారారు. 8 లక్షల 61వేల 925 మంది మరణించారు. అయితే రికరీలు భారీగానే పెరుగుతున్నాయి. కోటీ 82 లక్షల 17 వేల మందికి పైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. దాదాపు 68 లక్షల 57 వేల మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధిక కేసులతో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండగా... బ్రెజిల్, భారత్​, రష్యా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. రానున్న రెండు వారాల్లో బ్రెజిల్​ను అధిగమించి భారత్​ రెండో స్థానానికి చేరుకోవచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • దక్షిణ కొరియాలో వరుసగా 20వ రోజు మూడు అంకెల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. తాజాగా 267మందికి వైరస్​ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 20వేల 449కు చేరుకుంది.
  • నేపాల్​లోనూ కొవిడ్​ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా 1,120 కేసులు బయటపడగా.. 12 మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 41 వేలు దాటింది.
  • మెక్సికోలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 6,476 మందికి కొవిడ్​ పాజిటివ్​గా తేలింది. మరో 827మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంకేసులుమరణాలుకోలుకున్నవారు
అమెరికా62,59,0461,88,93134,97,840
బ్రెజిల్​39,52,7901,22,68131,59,096
భారత్​37,79,18166,56529,06,998
రష్యా10,05,00017,4148,21,169
పెరూ6,57,12929,068 4,71,599
దక్షిణాఫ్రికా6,28,25914,2635,49,993
కొలంబియా6,24,06920,0524,69,557
మెక్సికో6,06,03665,241 4,21,373

ఇదీ చూడండి: చైనాకు సొంత కమాండరే షాకిచ్చారు: అమెరికా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.