ETV Bharat / international

ఆ 7 లక్ష్యాలను సాధించినప్పుడే న్యూయార్క్​ రీఓపెనింగ్!​

author img

By

Published : May 19, 2020, 2:29 PM IST

కరోనా కారణంగా కకావికలమైన న్యూయార్క్​ నగరాన్ని ఇప్పట్లో తిరిగితెరిచే అవకాశమే లేదని మేయర్​ డి బ్లేసియో తెలిపారు. జూన్​ రెండో వారంలో ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తామని, అది కూడా వైరస్ కేసుల సంఖ్య తగ్గితేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

New York City could begin some re-opening only around "first half of June"
న్యూయాార్క్ నగంర రీ-ఓపెనింగ్ అప్పుడేే

కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది న్యూయార్క్​ నగరం. అమెరికాలో వైరస్​ వ్యాప్తికి కేంద్ర బిందువైంది. ఇప్పటికీ నగరంలో దుకాణాలు పాక్షికంగా తెరుచుకునేందుకు అధికారులు అనుమతించడం లేదంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

నగరంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆర్థిక, ఇతర కార్యకలాపాలను పాక్షికంగా పునరుద్ధరిస్తామని న్యూయార్క్​ మేయర్​ బిల్ డి బ్లేసియో తెలిపారు. జూన్​ రెండోవారంలో రీఓపెనింగ్ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏడు ఆరోగ్య ప్రమాణాల లక్ష్యాన్ని చేరుకుంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వాటిని సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు.

ప్రభుత్వం నిర్ధేశించిన ఏడు లక్ష్యాలు

  • మరణాల రేటు మూడురోజుల సగటును దాటకూడదు.
  • రోజుకు ఐదుకు మించి మరణాలు ఉండకూడదు.
  • లక్షమంది నివాసితులకు రెండు కేసులు మాత్రమే నమోదు కావాలి.
  • ఆస్పత్రులలో 30 శాతం పడకలు అందుబాటులో ఉండాలి.
  • ఐసీయూలలో 30శాతం పడకలు ఖాళీగా ఉండాలి.
  • టెస్టింగ్ సామర్థ్యం పెరగాలి.
  • కాంటాక్ట్​ ట్రేసింగ్​ పెరగాలి.

ఈ లక్ష్యాల్లో కొన్నింటిని ఇప్పటికే సాధించినట్లు, త్వరలోనే అన్నిటినీ సాధించనున్నట్లు న్యూయార్క్ గవర్నర్​ కౌమో చెప్పారు. రీఓపెనింగ్ తర్వాత ఎలాంటి ఆంక్షలు ఉండాలి, ఏ విధంగా ముందుకు సాగాలనే విషయాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

న్యూయార్క్​లోని ఆరు ప్రాంతాల్లో.. పైన పేర్కొన్న ఏడు లక్ష్యాలు సాధించామని, సెంట్రల్ న్యూయార్క్, ది నార్త్ కంట్రీ, ఫింగర్​ లేక్స్​, సౌతర్న్​ టైర్, వెస్టర్న్ న్యూయార్క్, మోహాక్ వ్యాలీలో మొదటి విడత కార్యకలాపాల పునురుద్ధరణ ఈ వారం చివరిలోగా ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

న్యూయార్క్​ నగరంలో కరోనా కేసుల సంఖ్య 3,51,371గా ఉంది. మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 28వేల మందికి పైగా మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.