ETV Bharat / international

అగ్నికి ఆహుతైన 200 చిరుతలు

author img

By

Published : Sep 16, 2020, 8:24 PM IST

బ్రెజిల్​లోని పాంటనాల్​ ప్రాంతంలో వందలాది చిరుతపులులు, సరీసృపాలు అగ్నికి ఆహుతయ్యాయి. 47 ఏళ్లకాలంలో ఎన్నడూలేని విధంగా.. భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.

Brazil's horrific blazes kill 200 Jaguars and reptiles
బ్రెజిల్​ అడవుల్లో వందలాది వన్యప్రాణులు సజీవ దహనం

బ్రెజిల్​లో చెలరేగుతున్న మంటల ధాటికి వందల సంఖ్యలో అటవీ జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. గత 47 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా ప్రమాదకర స్థాయిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిలో సుమారు 200 చిరుతపులులు, సరీసృపాలు, ఇతర వన్య ప్రాణులు సజీవ దహనమయ్యాయని పాంథెరా అనే అంతర్జాతీయ అటవీ పరిరక్షణ సంస్థ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత ఉష్ణమండల చిత్తడినేలలు కలిగిన బ్రెజిల్​లోని పాంటనాల్​ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది.

Brazil's horrific blazes kill 200 Jaguars and reptiles
కాలిపోయిన చెట్ల కొమ్మల్లో చిక్కుకున్న చిరుత

అగ్నిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న జంతువులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇందుకోసం అక్కడే ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటికి చికిత్స అందిస్తున్నారు.

Brazil's horrific blazes kill 200 Jaguars and reptiles
అగ్నికి ఆహుతైన మొసలి మృత కళేబరం

సూర్యుణ్ని కప్పేసి..

అనేక పార్కుల్లో చెలరేగుతున్న మంటలు, దట్టమైన పొగలు సూర్యుని జాడ కనిపించకుండా చేస్తున్నాయని ఫెడరల్​ యూనివర్సిటీ ఆఫ్​ రియో డి జెనెరియో విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నెల 12వరకు పాంటనాల్​ ప్రాంతంలో భారీ స్థాయిలో అగ్ని చెలరేగగా.. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

Brazil's horrific blazes kill 200 Jaguars and reptiles
నీరులేక.. నేలపైనే
Brazil's horrific blazes kill 200 Jaguars and reptiles
సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్న చిరుత

ఇదీ చదవండి: మాస్కు ధరించకపోతే.. గోతులు తవ్వాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.