ETV Bharat / entertainment

RC 16: ​చెర్రీ సినిమాకు రెహమాన్​ మ్యూజిక్​.. ఆ సెంటిమెంట్​ బ్రేక్​ అవుతుందా!

author img

By

Published : Apr 9, 2023, 6:29 PM IST

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ఆర్సీ 16. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్​ వచ్చింది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్​ అవార్డు గ్రహీత ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందించనున్నారట. ఆ వివరాలు.

ram charan new movie rc 16 ar rahman music director
రామ్​చరణ్​ ఆర్సీ 16కు ఏఆర్​ రెహ్మాన్​ మ్యూజిక్​

మెగా పవర్​ స్టార్​ రామ్​చరణ్​ కథానాయకుడిగా, ఉప్పెన ఫేమ్​ బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్​సీ 16 అనే వర్కింగ్​ టైటిల్​తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గురించి ఓ అప్​డేట్​ వచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​కు.. ఆస్కార్​ అవార్డ్​ గ్రహీత​​ ఏఆర్​ రెహమాన్​ సంగీతం అందించనున్నారట. ఇటీవ‌ల జ‌రిగిన ఓ త‌మిళ సినిమా ఈవెంట్‌లో.. హీరో రామ్‌చ‌ర‌ణ్ మూవీకి తానే మ్యూజిక్ కంపోజ్​ చేయనున్నానని స్వ‌యంగా రెహ‌మాన్​ వెల్ల‌డించారని వార్తలు వస్తున్నాయి. దీంతో బుచ్చిబాబు.. రామ్​చరణ్​తో చేయబోయే సినిమాకే రెహమాన్​ సంగీతం అందించబోతున్నారని.. నెట్టింట్లో చర్చ మొదలైంది. ఈ విషయానికి సంబంధించి చిత్రబృందం స్పందించలేదు. సినిమా యూనిట్​ నంచి అధికారిక ప్రకటన వస్తే.. ఈ విషయంపై స్పష్టత వస్తుంది.

రూరల్​ బ్యాక్​డ్రాప్​లో​ వస్తున్న ఈ సినిమా.. స్పోర్ట్స్ డ్రామా క‌థాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. వెంకట సతీష్‌ కిలారు, సుకుమార్‌ రైటింగ్స్‌ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను సమర్పిస్తోంది. షూటింగ్​ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆర్​సీ 16కు సంబంధించిన ప్రీ-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. కాగా, ఏఆర్​​ రెహమాన్​ మెగా ఫ్యామిలీ హీరోతో కలిసి పని చేయడం ఇదేమి తొలిసారి కాదు. పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ నటించిన 'కొమరం పులి' సినిమాకు రెహమాన్​ సంగీతం అందించారు.

చెర్రీతోనైనా ఫ్లాప్​ టాక్​కు చెక్​ పడుతుందా..!
ఇప్పటివరకు తెలుగులో కేవలం మూడు సినిమాలకు మాత్రమే మ్యూజిక్​ అందించారు ఏఆర్​ రెహమాన్​. అవి విక్టరీ వెంకటేష్​ నటించిన సూపర్​ పోలీస్​, సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటించిన 'నాని'తో పాటు పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్​ నటించిన కొమురం పులి సినిమాలకు సంగీతం సమకూర్చారు రెహమాన్​. ఈ మూడు సినిమాలు మ్యూజిక్​ పరంగా ఆడియన్స్​ను మెప్పించినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. కాగా, రామ్​చరణ్​ మూవీతోనైనా రెహమాన్​ ఫ్లాప్​ సెంటిమెంట్​కు చరణ్​ చెక్​ పెడ్తారా లేదా అన్నది వేచి చూడాలి.

'ఆర్​ఆర్​ఆర్'​ సినిమా గ్రాండ్​ సక్సెస్​తో ఫుల్​ జోష్​లో ఉన్నారు హీరో రామ్​చరణ్​. భారీ బడ్జెట్​ సినిమాల దర్శకుడిగా పేరొందిన శంకర్​తో కలసి ప్రస్తుతం 'గేమ్​ ఛేంజర్​' మూవీ షూటింగ్​లో బిజీగా ఉన్నారు చెర్రీ. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్​లో​ లేదా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా సెట్స్​పై ఉండగానే డైరెక్టర్​ బుచ్చిబాబుతో ఆర్​సీ 16కు రామ్​ చరణ్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. దర్శకుడు శంక‌ర్​తో సినిమా పూర్తి కాగానే ఈ సెప్టెంబ‌ర్​లోనే బుచ్చిబాబు సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చ‌ర‌ణ్ రెడీ అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇకపోతే, ఈ మూవీలో ఇప్పటివరకు హీరోయిన్​ ఇంకా ఫైనల్​ కాలేదు. ప్రస్తుతం ఇదే పనిలో చిత్రయూనిట్​ ఉన్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.