ETV Bharat / entertainment

సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి

author img

By

Published : Feb 19, 2023, 10:31 AM IST

Updated : Feb 19, 2023, 11:12 AM IST

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు మయిల్​సామి(57) గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తమిళ సినీ ప్రముఖలు సంతాపం వ్యక్తం చేశారు.

tamil actor mayilsamy passes away
తమిళ నటుడు మృతి

తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు మయిల్​సామి(57) ఆదివారం వేకువజామున గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని నడిగర్ సంఘం తెలిపింది. మయిల్​సామి సుమారు 100 సినిమాల్లో నటించారు. తమిళ అగ్రనటులు కమల్​హాసన్​, అజిత్, విజయ్​తో కలిసి స్క్రీన్​ షేర్ చేసుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

శివరాత్రి పర్వదినాన మయుల్​సామి చెన్నైలోని సాలి గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా అకస్మాత్తుగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు.

హాస్య నటుడు మయిల్​సామి 1984లో దర్శకుడు భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన 'తవని తనపుమ్​' చిత్రంతో తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటిస్తున్న ఆయనకు కమల్​హాసన్​ హీరోగా నటించిన సినిమా 'అపూర్వ సగోదర్​​గల్​'లో అవకాశం దక్కింది. ఈ సినిమా మయిల్​సామికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత బిన్, పుదు, గిల్లి వంటి పలు చిత్రాల్లో తనదైన హాస్యాన్ని పండించారు. స్వతహాగా మయిల్​సామి దివంగత తమిళ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి వీరాభిమాని. 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విరుగంబాక్కం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొవిడ్ సమయంలో మయిల్​సామి చాలా మంది నటులకు సాయం చేశారు.

Last Updated : Feb 19, 2023, 11:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.