ETV Bharat / entertainment

ఆ సమస్య వల్ల నా శరీరం సహకరించటంలేదు: శ్రుతిహాసన్‌

author img

By

Published : Jul 2, 2022, 6:10 AM IST

శ్రుతిహాసన్‌.. శాంతాను అనే ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే అతనితో పెళ్లి ఎప్పుడు అని అడిగితే.. సమాధానం చెప్పారు శ్రుతిహాసన్‌. తనకు ఎదురైన ఆరోగ్య సమస్యపై కూడా ఇన్​స్టాలో రాసుకొచ్చారు.

Shruti Haasan
శ్రుతిహాసన్‌

'పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు?'.. చాలా ఇంటర్వ్యూల్లో నటి శ్రుతిహాసన్‌ (Shruti Haasan)కు ఎదురైన ప్రశ్న ఇది. ఆమె ప్రేమలో ఉండటమే ఇందుకు కారణం. శ్రుతి ఎన్నిసార్లు సమాధానమిచ్చినా మళ్లీ మళ్లీ ఆమెకు ఈ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూలో శ్రుతిహాసన్‌ పాల్గొన్నారు. వృత్తిపరమైన విశేషాలు అడుగుతూనే సదరు రిపోర్టర్‌ వ్యక్తిగత సంగతులు ఆరా తీశారు. ''మీ మ్యారేజ్‌ ఎప్పుడు? ప్లాన్స్‌ ఏంటి?'' అని అడగ్గా ''మీకు ప్రశ్నకు సమాధానం నా దగ్గర లేదు'' అని తనదైన శైలిలో చమత్కరించారామె. శ్రుతిహాసన్‌ శాంతాను అనే ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. శాంతాను అంటే తనకెంతో ఇష్టమని ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

''పీసీఓఎస్‌, ఎండోమెట్రియోసిస్‌ వల్ల హార్మోన్ల సమస్య ఎదురైంది. ఇది ఎంత కష్టమైందో మహిళలకు తెలుసు. రోజువారీ పనులకూ నా శరీరం సహకరించటంలేదు కానీ నా మనసు బాగుంది. బాగా తింటున్నా, నిద్రపోతున్నా, వ్యాయామాన్ని ఆస్వాదిస్తున్నా'' అంటూ తన వర్కౌట్‌ వీడియోను శ్రుతి షేర్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. గతేడాది.. 'క్రాక్', 'వకీల్‌సాబ్‌' విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు శ్రుతి. ప్రస్తుతం ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'సలార్‌', ఎన్​బీకే107 (బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం) సినిమాలో నటిస్తున్నారు. 'కేజీయఫ్‌' ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 'సలార్‌', గోపీచంద్‌ మలినేని డైరెక్షన్‌లో 'ఎన్బీకే 107' తెరకెక్కుతున్నాయి.

ఇదీ చదవండి: నాకు, నరేశ్​కు మీ సపోర్ట్​ కావాలి: పవిత్రా లోకేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.