ETV Bharat / entertainment

'PK లా అవుతుందనుకున్నాం- ఆ విషయంపై మేం ఫోకస్ చెయ్యలేదు'

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 24, 2023, 7:58 AM IST

Updated : Dec 24, 2023, 10:49 AM IST

Shah Rukh Khan About Dunki : బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్- రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో తెరకెక్కిన 'పీకే' భారీ విజయం సొంతం చేసుకుంది. కాగా, తాజాగా షారుక్ డంకీ అదే 'పీకే' రేంజ్​లో ఫేమస్ అవుతుందనకుంది మూవీయూనిట్.

Shah Rukh Khan About Dunki
Shah Rukh Khan About Dunki

Shah Rukh Khan About Dunki : బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్- రాజ్​ కుమార్ హిరాణీ కాంబోలో తెరకెక్కిన 'డంకీ' మిక్స్​డ్​ టాక్​తో థియేటర్లలో రన్ అవుతోంది. అయితే గతంలో డైరెక్టర్ రాజ్​ కుమార్ హిరాణీ స్టార్ హీరో అమీర్ ఖాన్ లీడ్​ రోల్​లో తెరకెక్కించిన 'పీకే' మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. అప్పట్లో 'పీకే' పదం ఓ బ్రాండ్​గా మారింది. తాజాగా 'డంకీ' కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని అంతా భావించారు.కానీ, అలా జరగలేదు. ఈ విషయంపై షారుక్ రీసెంట్​గా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే?

'ఈ సినిమా ప్రారంభించే సమయానికి నాకు 'డంకీ' గురించి అంతగా తెలియదు. కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది. డైరెక్టర్ రాజు సర్​, నేను కలిసి పని చేయాలనుకున్నాం. అయితే కథను సరిగ్గా వివరించలేకపోతే ఆయన అసలు ముందుకు రారు. ఇక ఈ మూవీకి డంకీ టైటిల్ సెట్ అవుతుందని భావించారు రాజ్ సర్. కానీ డంకీ టైటిల్ అర్థమేంటో ప్రజలకు నిజంగా తెలియదు. మేమూ ఆ విషయంపై ఫోకస్ చెయ్యలేదు. ఎందుకంటే పీకే సినిమా సమయంలో కూడా టైటిల్ మీనింగ్ ఎవరికీ తెలీదు. మూవీ రిలీజ్ అయ్యాకే అందరికి పీకే గురించి తెలిసింది' అని షారుక్ అన్నారు.

ఇదే సందర్భంలో డంకీ అర్థం తెలిపారు షారుక్​. 'డంకీ అనేది ఓ చట్టవిరుద్ధమైన ప్రయాణం. దేశ సరిహద్దుల గుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు. పంజాబీలోని ఓ సామెత ప్రకారం ఈ పేరు వచ్చినట్లు షారుక్ తెలిపారు. అంతే కాకుండా వాళ్లు దాన్ని డంకీ అంటారని అలా డంకీ రూట్​ అనే పేరు వాడుకలోకి వచ్చింది' అని ఆయన వివరించారు.

Dunki Box Office Collections : డిసెంబర్ 21న గ్రాండ్​ రిలీజైన డంకీ తొలి రోడు దేశవ్యాప్తంగా రూ.29.2 కోట్ల నెట్​ సాధించింది. వరుసగా రెండు, మూడు రోజుల్లో రూ.20.12కోట్లు, రూ.26కోట్ల నెట్​ వసూల్ చేసింది. దీంతో మూడు రోజుల్లో డంకీ రూ.75.32నెట్ సాధించింది. అయితే ఈ ఏడాది విడుదలైన షారుక్ పఠాన్, జవాన్ సినిమాల కంటే ఇది చాలా తక్కువ.

'సలార్'​ కాదు- 'ఆదిపురుష్'​ను కూడా 'డంకీ' టచ్​ చేయలేకపోయిందట!

'డంకీ' మీనింగ్​ అదేనట- షారుక్ క్లారిటీ​- మరి సలార్ అంటే ఏంటో తెలుసా?

Last Updated : Dec 24, 2023, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.