ETV Bharat / entertainment

బుల్లితెరపైకి సాహసాల 'యశోద'.. ఏ టైమ్​కి ప్రసారం అవుతుందో తెలుసా?

author img

By

Published : Feb 5, 2023, 7:45 AM IST

టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద. యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆదివారం ఈటీవీలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినీ విశేషాలు మీ కోసం..

Samantha Movie Yashoda To Telecast In EETV
Samantha Movie Yashoda

సమంత ఇప్పుడు పరిపూర్ణమైన నటి. తొలినాళ్లలో గ్లామర్‌ తారగా సందడి చేసిన ఆమె.. కొన్నాళ్లుగా తనలోని నటిని ఆవిష్కరించే కథల్ని ఎంపికచేసుకుంటూ ప్రయాణం చేస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది 'యశోద'గా సినీప్రియుల్ని పలకరించి, మురిపించింది. హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా యాక్షన్‌ థ్రిల్లర్‌.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఇప్పుడు తొలిసారి బుల్లితెర వేదికగా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రం ఈరోజు సాయంత్రం 6:30గం.లకు ఈటీవీలో ప్రసారం కానున్న నేపథ్యంలో.. చిత్ర విశేషాలివీ..

కథేంటంటే..
వాస్తవ సంఘటనల ఆధారంగా సరోగసి పేరుతో జరిగే నేరాల చుట్టూ సాగే కథ ఇది. అమ్మతనంలోని గొప్పతనం తెలియకుండా చాలామంది సరోగసిని ఒక వ్యాపారంగా చేస్తుంటే దానిని తప్పుబట్టే అమ్మాయిగా యశోద పాత్రలో సమంత కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితుల వల్ల సరోగసికి ఒప్పుకున్న మహిళలందరినీ ఒక రహస్య స్థావరంలో అన్ని సౌకర్యాలతో ఉంచుతారు.

అన్నీ బాగున్నాయనుకున్న సమయంలో ఒక ప్రమాదాన్ని కనిపెడుతుంది యశోద. అద్దెగర్భం దాల్చిన మహిళలు డెలివరీ గదిలోకి వెళ్లి తిరిగిరాకపోవడం లాంటి విషయాలను నిశితంగా గమనిస్తుంటుంది. ఆ తరవాత అనుమానస్పదంగా ఒకరు చనిపోవడంతో కథ మలుపు తీసుకుంటుంది. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ హత్యను చేధించడానికి సమంత చేసిన సాహసాలు అలరిస్తాయి. ఆ తర్వాత ఏమైందనేది ఆసక్తికరం. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించారు.

  • ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్‌ లేకుండా పోరాటాలు చేసింది.
  • ఈ సినిమాలోని పోరాట ఘట్టాలకు ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు యానిక్‌ బెన్‌ నేతృత్వం వహించారు. ఆయన గతంలో సమంతతో కలిసి 'ది ఫ్యామిలీమ్యాన్‌ 2'కు పని చేశారు.
  • ఈ సినిమా విడుదలకు ముందే సమంత మయోసైటిస్‌ వ్యాధికి గురైంది. కానీ, ఈ చిత్రం ఆలస్యమవ్వకూడదనే ఉద్దేశంతోనే ఓవైపు వ్యాధితో ఇబ్బంది పడుతున్నా సరే.. చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకొని డబ్బింగ్‌ పనులు పూర్తి చేసింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.