ETV Bharat / entertainment

డిసెంబర్‌ లక్ష్యంగా 'ఆర్​సీ 15'.. 'శక్తిమాన్‌'గా రణ్​వీర్​ సింగ్​

author img

By

Published : Jul 9, 2022, 7:10 AM IST

రామ్‌చరణ్‌-శంకర్‌ 'ఆర్​సీ 15' చిత్రీకరణను డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. మరోవైపు 1990లలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సూపర్‌హీరో 'శక్తిమాన్‌' రీమేక్​ టైటిల్​ రోల్​లో రణ్​వీర్​సింగ్​ నటించనున్నారని తెలిసింది. ఆ వివరాలు..

Rc 15 and Ranveer singh as shakti man
శక్తిమాన్​గా రణ్​వీర్​ సింగ్​

Ramcharan RC 15 movie: రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ కథానాయిక. శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, జయరామ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 60శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. డిసెంబర్‌ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమృత్‌సర్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఇందులో భాగంగా వందలాది మంది డ్యాన్సర్లతో ఓ గ్రాండ్‌ పాటను, అలాగే ఓ భారీ ఫైట్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారు. తదుపరి షెడ్యూల్‌ కోసం చిత్ర బృందం ఆగస్టులో విదేశాలకు వెళ్లనుందని తెలిసింది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. సంగీతం- తమన్‌, మాటలు- సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం- తిరు, ఆర్‌.రత్నవేలు అందిస్తున్నారు.

Shaktiman Ranveer singh: 1990లలో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన సూపర్‌హీరో 'శక్తిమాన్‌'. ముఖేష్‌ ఖన్నా ఈ పాత్ర సృష్టికర్త. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కించేందుకు ఈ టీవీ షో హక్కుల్ని సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్స్‌ సొంతం చేసుకుంది. 'భీష్మ్‌ ఇంçర్నేషనల్‌'తో కలిసి ఫ్రాంఛైజీ చిత్రంగా నిర్మించనుంది. ఇందులో ఇండియన్‌ సూపర్‌ హీరో పాత్ర కోసం రణ్‌వీర్‌సింగ్‌తో చర్చలు జరుపుతున్నట్టు, తను ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. రణ్‌వీర్‌ ఈ పాత్ర పోషిస్తే ఈ పాత్రకు ఒక ఛరిష్మా వస్తుందని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో తొలిసారి.. శక్తిమాన్‌ రీమేక్‌ చేయబోతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. ప్రస్తుతం రణ్‌వీర్‌ నటించిన 'రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ' నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది.

ఇదీ చూడండి: కథానాయకులు బిజీ బిజీ.. ఫ్యాన్స్​ ఫుల్​ ఖుషీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.