ETV Bharat / entertainment

ప్రభాస్ 'ప్రాజెక్ట్​- K'లో కమల్​ హాసన్.. త్వరలోనే షూటింగ్​!

author img

By

Published : Jun 24, 2023, 11:07 PM IST

Updated : Jun 25, 2023, 1:32 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు నాగ్​ అశ్విన్​ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్​-కే సినిమా షూటింగ్​లో తమిళ స్టార్ కమల్​హసన్​ రానున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్​ సంస్థ అపీఫియల్​గా అనౌన్స్​ చేసింది.

Prabhas Project K Cast
ప్రభాస్ ప్రాజెక్ట్​ కే లో కమల్​హసన్

Kamal Haasan Project K : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్​ అశ్విన్​ కాంబినేషన్​లో ప్రాజెక్ట్​ కే (వర్కింగ్ టైటిల్) రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్​ బచ్చన్​, దీపిక పదుకుణె, దిశాపటానీ లాంటి స్టార్స్​ నటిస్తుండగా.. ఇప్పుడు ఈ యాక్షన్ ప్యాకేజీలోకి తమిళ స్టార్ కమల్​హసన్​ ఎంట్రీ ఇచ్చారు. 'ప్రాజెక్ట్​ కె'లో ఆయన ఓ కీ రోల్​ ప్లే చేస్తున్నట్లు మేకర్స్​ ఆదివారం అఫీషియల్​గా అనౌన్స్​ చేశారు.

ఇక లోకనాయకుడు కమల్​హాసన్​ 'ప్రాజెక్ట్ కె' లోకి రావడం పట్ల హీరో ప్రభాస్ హర్షం వ్యక్తం చేశారు. 'నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం ఇది' అంటూ ఆయన పేర్కొన్నారు. "కమల్‌హాసన్‌తో కలిసి నటిస్తుండటం మాటల్లో చెప్పలేనంత గౌరవరంగా ఉంది. సినిమా టైటానిక్ లాంటి కమల్​హాసన్ నుంచి నేర్చుకుని ఎదగడానికి అవకాశం దొరికింది. నా కల నిజమైంది"

ప్రమోషన్స్​ కోసం అక్కడ భారీ ఈవెంట్​..
Prabhas Project K Update : జూలై మొదటి, రెండో వారంలో ప్రాజెక్ట్ కే నుంచి అఫీషియల్​గా ఓ అప్​డేట్ ఇచ్చేందుకు మూవీ మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ప్రమోషన్స్​ చేసే భాగంలో.. విదేశాల్లో సినిమా పోస్టర్​ రిలీజ్​కు ఓ భారీ ఈవెంట్​ ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం.

ఇక సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్​తో వైజయంతీ మూవీస్ బ్యానర్​పై రూపొందుతోంది. ఈ సినిమాతో దీపికా తెలుగులో ఆరంగేట్రం చేయనున్నారు. ఇక షూటింగ్ పనులన్నీ సమయానికి పూర్తి అయితే 2024 సంక్రాతికి సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్​ ప్లాన్​ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాన్ఇండియా స్టార్​గా ఉన్న ప్రభాస్ కాస్త.. పాన్ వరల్డ్ స్టార్​గా మారిపోతున్నాడని డార్లింగ్ ఫ్యాన్స్ సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

సలార్ సెప్టెంబర్ 28!
Prabhas Salaar Release Date : మరోవైపు ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల చిత్రబృందం కీలక అప్​డేట్​ ఇచ్చింది. షూటింగ్​లో ముఖ్యమైన షెడ్యూల్​ పూర్తిచేసుకున్న ఈ సినిమా మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించింది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తున్నారు. జగపతి బాబుతో కీలక సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ కిరాగందుర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన లభించినందు వల్ల ప్రభాస్ అభిమానుల్లో సలార్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో వంద రోజుల్లోపే సలార్ థియేటర్లలో సందడి చేయనుందని ప్రభాస్ అభిమానులు అసక్తితో ఎదురుచూస్తున్నారు.

Last Updated :Jun 25, 2023, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.