ETV Bharat / entertainment

ఎన్టీఆర్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్!

author img

By

Published : Nov 1, 2022, 11:06 PM IST

'సింప్లిసిటీ అంటే ఇదీ'.. అంటూ జూ.ఎన్టీఆర్​ను ఆయన అభిమానులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఓ వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ ఏమైందనేగా మీ సందేహం! పదండి తెలుసుకుందాం.

ntr-show-his-simplicity-at-karnataka-rajyotsava-event
ఎన్టీఆర్‌ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా

ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. 'సింప్లిసిటీ అంటే ఇదీ' అంటూ పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి. 'కర్ణాటక రాజ్యోత్సవ' వేడుకలకు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోపాటు ఎన్టీఆర్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఈ వేదికపై ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వర్షం పడటంతో ఈ సభలో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు తడిశాయి. వాటిల్లోని ఓ కుర్చీని బట్టతో తుడిచి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ భార్య అశ్వినీని ముందు కూర్చోబెట్టారు ఎన్టీఆర్‌. మరో కుర్చీలో ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తిని కూర్చోమని చెప్పి, మహిళల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. అనంతరం, తాను కూర్చోబోయే కుర్చీనీ క్లీన్‌ చేసుకున్నారు.

ఈ విజువల్స్‌ను చూసిన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌కు 'కర్ణాటక రత్న' పురస్కారాన్ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్యోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం.. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, రజనీకాంత్‌, ఎన్టీఆర్‌లు పునీత్‌ సతీమణి అశ్వినీకి అందజేశారు. పునీత్‌ గురించి ఎన్టీఆర్‌ ఇచ్చిన కన్నడ ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.