ETV Bharat / entertainment

వీల్‌ ఛైర్‌లో వచ్చిన నిత్యా మేనన్‌.. ఫ్యాన్స్ ఆందోళన.. అసలేమైంది?

author img

By

Published : Jul 31, 2022, 9:26 PM IST

'తిరుచిత్రంబలం' సినిమా ఆడియో విడుదల వేడుకలకు నటి నిత్యా మేనన్‌ వీల్‌ ఛైర్‌లో రావడం ఫ్యాన్స్​ను విస్మయానికి గురిచేసింది. 'నిత్యకు ఏమైంది?', 'ఎందుకు వీల్‌ ఛైర్‌లో ఈవెంట్‌కు వచ్చారు?' అంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

nithya menon injury pics
nithya menon injury

అది 'తిరుచిత్రంబలం' సినిమా ఆడియో విడుదల వేడుక. చిత్ర బృందంలో చాలామంది రెడ్‌ కార్పెట్‌ వేదికగా ప్రాంగణంలోకి వస్తూ అభిమానుల్ని హుషారెత్తించారు. అదే కార్పెట్‌పై నటి నిత్యా మేనన్‌ వీల్‌ ఛైర్‌లో రావడం విస్మయానికి గురిచేసింది. సంబంధిత ఫొటోని చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం వల్ల ఆమెకు ఏం జరిగిందోనన్న సందేహం తలెత్తింది. 'నిత్యకు ఏమైంది?', 'ఎందుకు వీల్‌ ఛైర్‌లో ఈవెంట్‌కు వచ్చారు?' అంటూ నెటిజన్లు, ఆమె అభిమానులు ఆరా తీస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.

ఏం జరిగిందంటే.. తమ ఇంట్లో నడుస్తున్నప్పుడు జారి పడటం వల్ల నిత్య చీలమండకు గాయమైంది. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకున్నారు. గాయం కొంచెం మెరుగుపడిందని, నెమ్మదిగా నడుస్తున్నానని నిత్య ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలియజేశారు. దీంతోపాటు తన పెళ్లిపై వచ్చిన వదంతులను ఆమె ఖండించారు. మరోవైపు, 'మోడర్న్‌ లవ్‌: హైదరాబాద్‌' అనే వెబ్‌ సిరీస్‌లో స్టిక్‌ సహాయంతోనే నడవగలిగే అమ్మాయి పాత్రను పోషించడం యాదృచ్ఛికమని తెలిపారు. ఈ సిరీస్‌ ఈవెంట్‌లోనూ నిత్య స్టిక్‌ పట్టుకుని నడవడం చాలామందిని కంగారు పడేలా చేసింది.

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన మ్యూజికల్‌- డ్రామా చిత్రమే 'తిరుచిత్రంబలం'. ఈ తమిళ చిత్రానికి మిత్రన్‌ జవహర్‌ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ ఇతర కథానాయికలు. భారతీరాజా, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం శనివారం సాయంత్రం చెన్నైలో ఆడియో వేడుక చేసింది. విజయ్‌ సేతుపతి సరసన నిత్య నటించిన 19 (1) (ఎ) అనే మలయాళ చిత్రం 'డిస్నీ+ హాట్‌స్టార్‌'లో ఇటీవల విడుదలై, ప్రేక్షకుల్ని అలరిస్తోంది.

ఇవీ చదవండి:బ్లూ​ గౌన్​లో సారా అందాల విందు.. అనూష హాట్​ లుక్స్​

'బాలీవుడ్ పని అయిపోలే.. ముందుంది అసలు పండగ!'.. కరణ్ జోహర్ షాకింగ్​ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.