ETV Bharat / entertainment

నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా

author img

By

Published : Jun 24, 2022, 5:30 PM IST

Updated : Jun 24, 2022, 5:42 PM IST

Nandamuri Balakrishna tested corona positive
Nandamuri Balakrishna tested corona positive

17:26 June 24

నటుడు నందమూరి బాలకృష్ణకు కరోనా

Balakrishna Corona: సినీ నటుడు, హిందూపూర్​ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. స్వయంగా ఆయనే ఈ విషయం వెల్లడించారు. రెండ్రోజులుగా తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు ప్రకటించిన బాలకృష్ణ.. త్వరలోనే సాధారణ కార్యకలాపాల్లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇక సినిమాల విషయానికొస్తే, 'అఖండ' విజయంతో బాలకృష్ణ జోరుమీదున్నారు. ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీలో నటిస్తున్నారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. దీని తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటు వ్యాఖ్యాతగానూ బాలకృష్ణ మరోసారి అలరించనున్నారు. 'అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2'తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇవీ చూడండి: బాలయ్య సినిమాలో రాజశేఖర్​.. విలన్​గా కాదు ఆ పాత్రలో!

బాలయ్య 'అన్​స్టాపబుల్'​ సీజన్-2​ రెడీ.. ఫ్యాన్స్​లో ఫుల్​ జోష్​

Last Updated : Jun 24, 2022, 5:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.