ETV Bharat / entertainment

ఆ ఒక్క సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలా?

author img

By

Published : Oct 22, 2022, 7:04 PM IST

సినిమా అంటే ఒకరో ఇద్దరో మహా అయితే ఓ నాలుగైదు సంస్థలు కలిసి నిర్మిస్తాయి. కానీ ఇక్కడ ఓ సినిమాకి 5 లక్షల మంది కలిసి నిర్మించారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటో తెలుసా?

manthan movie five lakh producers
ఆ ఒక్క సినిమాకు 5 లక్షల మంది నిర్మాతలు

సినిమా అంటే ఒకరో ఇద్దరో మహా అయితే ఓ నాలుగైదు సంస్థలు కలిసి నిర్మిస్తాయి. కానీ ఇక్కడ ఓ సినిమాకి 5 లక్షల మంది నిర్మాతలు. ఆ చిత్రమే 'మంథన్‌'. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంలో విశేష కృషి చేసి, శ్వేత విప్లవ పితామహుడిగా పేరు తెచ్చుకున్న వర్గీస్‌ కురియన్‌ జీవిత కథ నేపథ్యంలో దిగ్గజ దర్శకుడు శ్యామ్‌ బెనెగల్‌ తెరకెక్కించిన చిత్రమిది. వర్గీస్‌ రాకతో గుజరాత్‌ పాడి రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి.

దీంతో ఈ సినిమా నిర్మాణానికి రైతులు భాగస్వామ్యం వహించడం సముచితం అనే శ్యామ్‌ బెనెగల్‌ ఆలోచనకు గుజరాత్‌ కో ఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. దీంతో ఇందులో భాగస్వాములుగా ఉన్న 5 లక్షల మంది రైతులు రూ.2 చొప్పున ఇచ్చారు. ప్రపంచంలో ఇంత ఎక్కువమంది నిర్మించిన తొలి క్రౌండ్‌ ఫండింగ్‌ సినిమాగా 'మంథన్‌' రికార్డు సృష్టించింది. మన దేశంలో అయితే ఇదే తొలి క్రౌడ్‌ ఫండింగ్‌ సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమాని విజయవంతం చేయాలని అప్పట్లో రైతులు ఎద్దుల బళ్లపై గుంపులుగుంపులుగా థియేటర్లకు తరలి రావడం చర్చనీయం అయ్యింది. గిరీశ్‌ కర్నాడ్‌, నసీరుద్దీన్‌షా, అమ్రిష్‌పురి, స్మితా పాటిల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం పలు జాతీయ పురస్కారాలు గెలుచుకుంది.

ఇదీ చూడండి: రచయితగా మారిన సోనూ సూద్​.. సినిమా రిలీజ్​ అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.