SSMB 28 Title : 'గుంటూరు'పై మనసు పడిన మహేశ్​!

author img

By

Published : May 15, 2023, 1:37 PM IST

SSMB 28 Title

SSMB 28 Title Name : మహేశ్ బాబు-త్రివిక్రమ్​ కాంబోలో రూపొందుతున్న SSMB 28 సినిమా టైటిల్​కు సంబంధించి మరో పేరు​ తెరపైకి వచ్చింది. దాదాపు ఇదే ఫిక్స్​ చేస్తారని తెలుస్తోంది. ఆరోజే దీన్ని అనౌన్స్​ కూడా చేస్తారట. ఆ వివరాలు..

SSMB 28 Title announcement : సూప‌ర్ స్టార్ మ‌హేశ్​ బాబు కొత్త సినిమా SSMB 28 కొద్ది రోజులుగా వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. త్రివిక్రమ్​-మహేశ్​ మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయని, షూటింగ్ వాయిదా పడిందని, ఇప్పటికే చిత్రీకరించిన సన్నివేశాలు అనుకున్నంత బాగా రాలేదని, స్క్రిప్ట్​ విషయంలో మార్పులు, చర్చలు కొనసాగుతున్నాయని, అందుకే మహేశ్.. షూటింగ్​కు బ్రేక్ ఇచ్చి ఫారెన్ ట్రిప్స్​కు వరుసగా వెళ్తున్నారని.. ఇలా రకరకాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్​ కూడా రావట్లేదు.

మరోవైపు టైటిల్ విషయంలోనూ కొద్ది రోజులుగా రకరకాలుగా పేర్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్​కు 'అ' అనే అక్షరం సెంటిమెంట్​గా ఉండటం వల్ల.. 'అ' అనే అక్షరంతోనే పెడతారని అంటున్నారు. ఇందులో భాగంగానే 'అమ‌రావతికి అటు ఇటు' అనే టైటిల్ తెరపైకి వచ్చింది. కానీ దానిపై నెగటివ్​ ఫీడ్​ బ్యాక్​ ఎక్కవగా ఉండటంతో మూవీటీమ్​.. మనసు మార్చుకుందని అన్నారు.

ఇప్పుడు తాజా క‌బురేంటంటే.. ఈ సినిమా టైటిల్‌ గురించి మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. 'గుంటూరు' అనే పదం ఉండేలా చూస్తున్నారట. 'గుంటూరు కారం', 'గుంటూరు మిర్చి', 'గుంటూరు అబ్బాయి'.. ఇలా ఈ మూడు టైటిళ్లు ప్ర‌స్తుతం ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. అయితే ఇందులో 'గుంటూరు కారం' టైటిల్‌కు ఎక్కువ‌ మంది మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ఎందుకంటే 'మిర్చి' ప‌దం జోడిస్తే.. ప్ర‌భాస్ సినిమా టైటిల్ తీసుకున్న‌ట్లు ఉంటుంది. 'అబ్బాయి' అనే పదం ఉపయోగిస్తే.. సాఫ్ట్​గా ఉంటుంది. అందుకే మాస్‌కు త్వరగా క‌నెక్ట్​ అయ్యేలా 'గుంటూరు కారం' అనే టైటిల్ అయితే సెట్​ అవుతుందని ఆలోచిస్తున్నారట. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్​ పోస్టర్​​​ చూస్తే.. మహేశ్​ మాస్‌ లుక్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. ఆ పోస్టర్​లో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టి చూస్తే.. మిర్చి యార్డ్‌లో జరిగే ఓ యాక్షన్‌ సన్నివేశం కూడా ఉంటుందని అర్థమవుతోంది. అలాగే ఈ పోస్టర్​.. 'గుంటూరు కారం' టైటిల్​కు దగ్గరగా ఉంటుంది.

ఏదేమైనప్పటికీ ఏ టైటిల్​ ఇంకా పక్కాగా ఖరారు అవ్వలేదు కానీ వీలైనంత త్వ‌ర‌గానే టైటిల్​ను ఖరారు చేసి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. మే 31న కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్​ను రిలీజ్​ చేసే అవ‌కాశాలున్నాయి. ఇకపోతే ఈ చిత్రాన్ని హారిక అండ్​ హాసిని క్రియేష‌న్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. శ్రీలీల, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మొత్తంగా సరికొత్త ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: పీఎస్‌ వినోద్‌.

ఇదీ చూడండి: రామ్-బోయపాటి మూవీ.. ఫస్ట్ థండర్​ బ్లాస్ట్​.. యాక్షన్​ వేరే లెవెల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.