ETV Bharat / entertainment

కాంతార మూవీ ఎఫెక్ట్‌.. సర్కార్​ కీలక నిర్ణయం.. ఏంటంటే?

author img

By

Published : Oct 20, 2022, 8:08 PM IST

ఇటీవలే చిన్న సినిమాగా విడుదలై ఇతర భాషల్లోనూ మంచి వసూళ్లను అందుకుంటూ దూసుకుపోతుంది కాంతార సినిమా. అయితే తాజాగా ఈ సినిమాకు వస్తున్న ప్రేక్షకాదరణ చూసి ఓ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఏంటంటే?

Kantara movie
కాంతార మూవీ ఎఫెక్ట్‌.. సర్కార్​ కీలక నిర్ణయం

భాషతో సంబంధం లేకుండా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు 'కాంతార'. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను తెరపై చూపించిన తీరు, ఆ పాత్రలో ఆయన నటన మెప్పిస్తోంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్‌ ఎంపీ పీసీ మోహన్‌ ట్విటర్‌ వేదికగా ట్వీట్ చేశారు.

"దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి భాజపా నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్‌ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్‌ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి, మంత్రి సునీల్‌ కుమార్‌ కాకర్లకు కృతజ్ఞతలు" అని పీసీ మోహన్‌ పేర్కొన్నారు.

బాలీవుడ్‌లో వేగంగా.. కన్నడ చిత్రంగా విడుదలై ఇప్పుడు ఇతర భాషల్లోనూ భారీ వసూళ్లను అందుకుంటోంది 'కాంతార'. ముఖ్యంగా బాలీవుడ్‌లో కలెక్షన్లలో వేగం పెరిగింది. విడుదలైన శుక్రవారం రూ.1.27కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ మూవీ శనివారం రూ.2.75, ఆదివారం 3.50, సోమవారం 1.75, మంగళవారం 1.88కోట్లు, బుధవారం రూ.1.95కోట్లు రాబట్టింది. మొత్తం ఇప్పటివరకూ రూ.13.10కోట్లు వసూలు చేసింది.

ఇదీ చూడండి: హీరో అజిత్ అద్భుత సాహసం​ ఈ సారి ఏకంగా 18 నెలలు 62 దేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.