ETV Bharat / entertainment

పవన్​ కల్యాణ్ 'జల్సా' రీరిలీజ్.. కొత్త ట్రైలర్ ఇదిగో...

author img

By

Published : Aug 30, 2022, 6:38 PM IST

Jalsa Re Release : తెలుగులో ఓ కొత్త ట్రెండ్​ మొదలైంది. హీరోల పుట్టిన రోజు సందర్భంగా పాత సిమాలను సరికొత్తగా రీరిలీజ్​ చేస్తున్నారు. పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్ నటించిన 'జల్సా'ను సెప్టెంబర్​ 1న రీరిలీజ్​ చేయనున్నారు. అందుకోసం సరికొత్త ట్రైలర్​​ విడుదల చేశారు.

Jalsa Re Release
jalsa re release trailer starring pawan kalyan launched by sai dharam tej

Jalsa Re Release : కొన్ని సినిమాలని టీవీ, ఓటీటీ, యూట్యూబ్‌లో చూసినప్పుడు 'అరెరే.. ఇంత మంచి సినిమాని థియేటర్‌లో చూడటం మిస్‌ అయ్యానే' అని చాలా మంది అనుకుంటుంటారు. తమ హీరోల చిత్రాలను థియేటర్‌లోనే పలుమార్లు వీక్షించినా 'ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడుదలైతే ఆ మజానే వేరు. పండగ చేసుకోవచ్చు' అని మరి కొందరు అభిప్రాయపడుతుంటారు. ఇలాంటి వారి కోసమే కొత్త ట్రెండ్‌ మొదలైంది. కొన్నాళ్ల క్రితం సూపర్‌హిట్‌గా నిలిచిన పలు చిత్రాలు '4కే' ప్రింట్‌తో సిద్ధమై, ఆయా హీరోల పుట్టినరోజు సందర్భంగా మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే మహేశ్‌బాబు పుట్టినరోజును పురస్కరించుకుని 'పోకిరి', 'ఒక్కడు', చిరంజీవి బర్త్‌డేకి ‘

'ఘరానా మొగుడు' చిత్రాలు రీ-రిలీజ్‌ అయ్యాయి. పవన్‌ కల్యాణ్‌ జన్మదినం సందర్భంగా 'జల్సా' సెప్టెంబరు 1న విడుదలకానుంది. ఈ క్రమంలో నటుడు సాయిధరమ్‌ తేజ్‌ ఈ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. 'జల్సా'.. రీరిలీజ్‌పై ఆనందం వ్యక్తం చేశారు.

ట్రైలర్‌ విషయానికొస్తే.. మహేశ్‌బాబు చెప్పే మాటల(వాయిస్‌ ఓవర్‌)కు తగ్గట్టు సన్నివేశాలను ఎడిట్‌ చేసిన తీరు బాగుంది. హీరో పరిచయ సన్నివేశం, పాటల క్లిప్పింగ్స్‌, పోరాట దృశ్యాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. 'గబ్బర్‌సింగ్‌'లో 'పాటొచ్చి పదేళ్లయినా పవర్‌ తగ్గలేదు' అని అలీ చెప్పినట్టు.. 'సినిమా వచ్చి (సుమారు) పద్నాలుగేళ్లయినా.. పవర్‌ తగ్గలేదు' అని ట్రైలర్‌ అందరితో అనిపించేలా ఉంది. ఇంకెందుకు ఆలస్యం దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించిన 'జల్సా' జ్ఞాపకాలను గుర్తుచేసుకోండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి: 'వాళ్లు ఇలా చేయడం బాధాకరం'.. లైగర్‌ రిజల్ట్​పై ఛార్మి స్పందన

'నా బుజ్జాయితో సరిగ్గా స్పెండ్​ చేయలేకపోతున్నా.. ఆ సమయంలో నొప్పి భరిస్తూనే ఫీడింగ్‌ ఇచ్చా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.