ETV Bharat / entertainment

'పుష్ప'రాజ్​ మాస్ హవా.. ఒక్క లుక్​తో రికార్డులే రికార్డులు!

author img

By

Published : Apr 8, 2023, 7:38 PM IST

పుష్ప-2 చిత్రంలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫస్ట్ లుక్.. సోషల్​మీడియాలో సూపర్​ రికార్డులు క్రియేట్​ చేసింది. అవేంటంటే?

icon star allu arjun first look poster in pushpa 2 creates records in social media
icon star allu arjun first look poster in pushpa 2 creates records in social media

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'పుష్ప 2'. పాన్ ఇండియా సక్సెస్ సాధించిన 'పుష్ప' చిత్రానికి ఇది సీక్వెల్. ఏప్రిల్​ 8 శనివారం బన్నీ బర్త్ డే. అయితే అభిమానులకు ఒక్క రోజు ముందు 'పుష్ప 2' టీమ్ గిఫ్ట్ ఇచ్చింది. సినిమాలో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్, 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ విడుదల చేసింది. ఆ లుక్, టీజర్ రికార్డులు క్రియేట్ చేశాయి.

'పుష్ప 2'లో అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అయ్యింది. చీర కట్టి, ముక్కు పుడక పెట్టి, బొట్టుతో బన్నీ కొత్తగా కనిపించారు. తిరుపతిలో గంగమ్మ జాతరలో పురుషులు ఏ విధంగా పాల్గొంటారో, ఆ విధంగా కనిపించి ఔరా అనిపించారు. ఆ లుక్ రికార్డులు క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ 'పుష్ప 2' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ట్విట్టర్‌లో 2లక్షలు, ఫేస్‌బుక్‌లో 50 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 8లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఎక్కువ మంది లైక్ చేసిన లుక్ కింద 'పుష్ప 2' రికార్డు క్రియేట్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

యూట్యూబ్‌లో 'వేర్ ఈజ్ పుష్ప' టీజర్ అయితే 24 గంటల్లో ఎక్కువ మంది చూసిన తెలుగు సినిమా టీజర్లలో 'ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్' మూడో స్థానంలో నిలిచింది. దీనికి 22.52 మిలియన్ వ్యూస్ వచ్చాయి. హిందీ వెర్షన్ టీజర్ 30 మిలియన్ వ్యూస్​కు చేరువలో ఉంది. యూట్యూబ్‌లో 24 గంటల్లో ఎక్కువ మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఉంది. ఏడు లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి.

అయితే శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఉన్నట్లు.. టీజర్​లో మేకర్స్ చూపించారు. 'పుష్ప'లో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ కింద చూపిస్తే.. ఇప్పుడు ఈ రెండో భాగంలో ఆయన్ను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు.. వాళ్ల పిల్లలకు విద్య, అవసరమైన వాళ్లకు వైద్యం చేయించినట్టు తెలిపారు. దాంతో 'పుష్ప'కు అభిమానులు ఏర్పడ్డారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్న మరోసారి సందడి చేయనున్నారు.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్​ పుట్టిన రోజు కనుక సినీ ప్రముఖలతో పాటుగా అభిమానులు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ సైతం ఐకాన్ స్టార్​కు విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం వార్నర్ హైదరాబాద్ జట్టులో లేకపోయినా.. ఇలా బన్నీకి శుభాకాంక్షలు చెప్పడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "బిగ్ షౌటౌట్, బిగ్ మ్యాన్.. అల్లు అర్జున్ హ్యాపీ బర్త్ డే మేట్. పుష్ప-2 కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాం" అని చెప్పాడు. ఇక వార్నర్​తో పాటు కూతురు ఇస్లా కూడా హ్యాపీ బర్త్ డే పుష్ప అంటూ చాలా క్యూట్‌గా చెప్పింది. వార్నర్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.