ETV Bharat / entertainment

నేను చావలేదు.. పోరాడతా.. అలాంటివి రాయొద్దు: సమంత ఎమోషనల్​

author img

By

Published : Nov 8, 2022, 3:18 PM IST

Updated : Nov 8, 2022, 3:34 PM IST

యశోద ప్రమోషన్స్​లో పాల్గొన్న హీరోయిన్ సమంత తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఇంకా చిత్ర విశేషాలను గురించి చెప్పుకొచ్చారు. ఆ సంగతులు..

samantha health condition
సమంత ఆరోగ్యం

సోషల్ మీడియాలో తన అనారోగ్యం గురించి చెప్పిన స్టార్ హీరోయిన్​ సమంత.. ఆ తర్వాత మళ్లీ ఈ విషయంపై మాట్లాడలేదు. అయితే, ఇప్పుడు తొలిసారి తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చారామె. సామ్​ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం యశోద. ఈ సినిమాలో సరోగసీ మదర్‌గా ఆమె నటించారు. థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ యాక్షన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కింది. ఈనెల 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

అయితే, విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో తొలిసారి యశోద కోసం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు సామ్​. ప్రముఖ యాంకర్ సుమ కనకాల చేసిన ఈ ఇంటర్వ్యూలో చిత్రం కోసం తాను పడిన కష్టం, తపన గురించి వివరించారు. అలాగే, తన అనారోగ్యం గురించి కూడా మొదటిసారి మాట్లాడారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు.

"జీవితంలో కొన్ని మంచి రోజులు ఉంటాయి.. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి అని నా సోషల్ మీడియా పోస్టులో చెప్పాను. ఒక్కోసారి ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమో అనిపించింది. కానీ, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక్కడి వరకు వచ్చానా అనిపిస్తుంది. నేను ఇలాగే పోరాడతా. నాలానే చాలా మంది పోరాడుతున్నారు. ఈ పోరాటంలో మేం గెలుస్తాం. నాకు ప్రాణహాని ఉందని చాలా ఆర్టికల్స్‌లో చూశాను. నేను ఉన్న స్టేజ్‌లో ఇది ప్రాణహాని కాదు. ప్రస్తుతానికి అయితే నేను చావలేదు. కాబట్టి అలాంటి హెడ్‌లైన్స్ అవసరమని నేను అనుకోవట్లేదు. కానీ, నా పరిస్థితి క్లిష్టమైనదే. అయినప్పటికీ నేను పోరాడతాను. ఈ చిత్రంలోని యశోద పాత్ర, నా రియల్​ లైఫ్​కు కనెక్ట్​ అయింది. ఆ పాత్ర క్లిష్​ పరిస్థితులను ఎదుర్కొని పోరాడుతుంది. ప్రస్తుతం నేను కూడా నిజజీవితంలో అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాను." అని సమంత కంటతడి పెట్టుకున్నారు.

ఇక ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో కూడా డబ్బింగ్ చెప్పడం గురించి సమంత మాట్లాడుతూ.. "ప్రాణం పెట్టి నటించిన తర్వాత సొంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉంటుంది. నాకు కూడా ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. ప్రస్తుతం నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. తెలుగు కూడా బాగా నేర్చుకున్నాను. కానీ, యశోదకు కష్టకాలంలో డబ్బింగ్ చెప్పాను. విడుదల తేదీ ప్రకటించారు కాబట్టి ఆరోగ్యం బాగాలేకపోయినా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. నాకు కొంచెం మొండితనం ఎక్కువ. నేనే డబ్బింగ్ చెప్పాలని ఒకసారి డిసైడ్ అయ్యాను కాబట్టి కష్టమైనా చేసేశాను. దీన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

డ్యాన్స్​ కన్నా యాక్షన్​ సీన్స్ చేయడమే​ తనకు ఇష్టమని చెప్పిన సామ్​.. ఈ చిత్రంలో యాక్షన్​ సీన్స్​కు డూప్​ లేకుండా తానే చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో ముఖంపై గాయం అయినట్లు చెప్పింది. సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని తాను ఆశిస్తున్నట్లు చెప్పిన సామ్​... థియేటర్లలో ప్రేక్షకులతో కలిసి సినిమాలు చూడటమంటే ఇష్టమని పేర్కొంది. యశోద కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారని, ఎక్స్​టార్డనరీ సెట్​లు వేశారని తెలిపింది. అది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుందని చెప్పింది.

ఇదీ చూడండి: అనుష్క ఇన్ని సూపర్​ హిట్​ సినిమాలు రిజెక్ట్ చేసిందా

Last Updated :Nov 8, 2022, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.