ETV Bharat / entertainment

మాధవన్ ఆడిషన్ వీడియో వైరల్​.. ఎంత ఎమోషనల్​గా చెప్పారో!

author img

By

Published : Feb 7, 2023, 10:02 AM IST

'సఖి', 'చెలి', '13 బీ' వంటి సినిమాలతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటుడు, రొమాంటిక్​ హీరో మాధవన్.​ ఆయనకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో బయటకు వచ్చింది. దాన్ని మీరు చూసేయండి..

Madhavan audition video
మాధవన్ ఆడిషన్ వీడియో వైరల్​.. ఎంత ఎమోషనల్​గా చెప్పారో!

సినీఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే తన నవ్వుతోనే అందరినీ ఆకట్టుకున్నారు నటుడు మాధవన్‌. కథానాయకుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగానూ ప్రేక్షకాదరణ పొందారు. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించి కుర్రకారు మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అమ్మాయిల కలల రాకుమారుడిగా నిలిచి రొమాంటిక్​ హీరోగా పేరు గాంచారు మాధవన్​. 'సఖి', 'చెలి', '13 బీ' వంటి సినిమాలతో టాలీవుడ్​లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బహుభాషా నటుడు. 'రెహనా హై తేరే దిల్ మే', 'రంగ్ దే బసంతి', '3 ఇడియట్స్' వంటి సినిమాలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.

అయితే రీసెంట్​గా మాధవన్ గురించి ఓ ఇంట్రెస్ట్​ వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. మాధవన్ నటించిన 3 ఇడియట్స్ సినిమా బాలీవుడ్​లో ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రంలో మాధవన్ ఫర్హాన్ ఖురేషి పాత్రలో నటించారు. అయితే ఈ మూవీలో నటించేముందు ఆయనకు కూడా ఆడిషన్స్ నిర్వహించారట. ఇప్పటి వరకూ ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడా వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఆడిషన్స్ వీడియో క్లిప్ చూసిన అభిమానులు తెగ లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది అభిమానులు మాత్రం మాధవన్​కు కూడా ఆడిషన్స్​ ఏంటి అని అంటున్నారు. ఈ వీడియోలో మాధవన్ సినిమాలో తాను ఫోటోగ్రఫీని కెరీర్​గా ఎంచుకోవడానికి తన తండ్రిని ఒప్పించడానికి చేప్పే డైలాగ్ సన్నివేశంలా ఉంది.

కాగా, 3 ఇడియట్స్ సినిమా 2009లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో విడుదలై భారీ హిట్​ను అందుకుంది. దాదాపు రూ.400 కోట్ల కలెక్షన్స్​ను సాధించింది. ఈ సినిమాను దర్శకుడు శంకర్ రిమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని స్నేహితుడు పేరుతో విడుదల చేశారు. ఇది కూడా సక్సెస్ అయింది. ఇక మాధవన్ చివరిగా.. రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్, ధోఖా రౌండ్ ది కార్నర్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ది రైల్వే మెన్ వెబ్ సిరీస్​లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: వేసవి అంతా ఈ కుర్ర హీరోలదే జోరు... బాక్సాఫీస్​ మోత మోగిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.