'ఎన్ని దెబ్బలు తగిలినా.. కష్టపడుతూనే ఉంటా!'.. 'ఛత్రపతి' రిజల్ట్​పై బెల్లంకొండ కామెంట్స్​

author img

By

Published : May 17, 2023, 10:35 PM IST

Bellamkonda Sreenivas Chatrapathi

బాలీవుడ్‌లో ఛత్రపతి రీమేక్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకోవాలని ఎంతో శ్రమించారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. తాజాగా ఛత్రపతి పరాజయంపై ఆయన స్పందించారు.

Bellamkonda Sreenivas Chatrapathi : టాలీవుడ్​ స్టార్​ బెల్లంకొండ సాయి శ్రీనివాస్​ ఛత్రపతి హిందీ రీమేక్​తో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటి దాకే తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ఈ స్టార్​.. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హిందీ సినిమాలో మెరిశారు. తెలుగులో సూపర్ హిట్​ అయిన ఛత్రపతి సినిమాతో అక్కడ హిట్​ కొడుదామని ఆశించారు. కానీ ఆయనకు నిరాశే మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలై అనుకోని విధంగా ఆ చిత్రం పరాజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఛత్రపతి పరాజయంపై బెల్లంకొండ శ్రీనివాస్‌ స్పందించారు.

"ఆశల నుంచే స్ఫూర్తి లభిస్తుంది. జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నా ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలవచ్చు. అయినప్పటికీ, నా మనసు కోరుకునే ఆనందాన్ని అందించడం కోసం కష్టపడి పనిచేయాలనేదే నా అజెండా" అని శ్రీనివాస్​ రాసుకొచ్చారు.

రాజమౌళి-ప్రభాస్‌ కాంబోలో వచ్చిన ఛత్రపతికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తాను నటించిన తెలుగు చిత్రాలకు (డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో విశేష ఆదరణ ఉందని, దానిని దృష్టిలో ఉంచుకునే ఛత్రపతి రీమేక్‌తో ఉత్తరాది ప్రేక్షకులను అలరించాలని శ్రీనివాస్‌ భావించారు. నుష్రత్‌, భాగ్యశ్రీ, కరణ్‌ సింగ్‌ వంటి తారాగణంతో సిద్ధమైన ఈ సినిమా మే 12న విడుదలై పరాజయాన్ని అందుకుంది. రీమేక్‌ ప్రేక్షకులకు చేరువయ్యేలా సినిమాని తెరకెక్కించడంలో ఈ టీమ్‌ విఫలమైందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇండియా మొత్తం కలిపి ఈ సినిమాకు ఫస్ట్​ డే కేవలం రూ.60 లక్షలు మాత్రమే కలెక్షన్స్ వచ్చినట్లు సమచారం. ఓవర్సీస్‌లో రూ.10 లక్షల మేర వసూళ్లు చేసిందని అంచనా. మొత్తం కలిపి తొలి రోజు ఈ సినిమా రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేసిందట.

మాస్​ ఆడియెన్స్​కు విపరీతపంగా కనెక్ట్​ అయిన బెల్లంకొండకు సౌత్​తో పాటు నార్త్​లోనూ మంచి ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. ఆయన నటించిన 'జయ జానకీ నాయక', 'సీత', 'అల్లుడు శీను', 'సాక్ష్యం' లాంటి సినిమాలన్నీ యూట్యూబ్​లో రికార్డు స్థాయిలో వ్యూస్​ సంపాదించాయి. తన యాక్షన్​ మూవీస్​తో టాలీవుడ్​ను షేక్​ చేసిన వి.వి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కూడా ప్లస్​ పాయింట్​ అవుతుందని అనుకున్నారు. కానీ అనుకున్నవేమి జరగలేదు.

రాజమౌళి తెరకెక్కించిన 'ఛత్రపతి'.. హీరో ప్రభాస్​కు బ్రేక్​ ఇచ్చిన సినిమాల్లో ఒకటి. ప్రభాస్​ ఈ సినిమాతో అటు క్లాస్​ ఆడియెన్స్​తో పాటు ఇటు మాస్​ ఆడియెన్స్​లో మంచి క్రేజ్​ సంపాదించుకున్నారు. ఇందులోని యాక్షన్​ సీన్స్ గూస్​బంప్స్​ తెప్పిస్తే.. సెంటిమెంట్​ సీన్స్​ అభిమానుల చేత కంటతడి పెట్టిస్తుంది. భానుప్రియ, అజయ్​, ఛత్రపతి శేఖర్​ తమ క్యారెక్టర్లలో లీనమైపోయి నటించారు. విలన్​గా నటించిన ప్రదీప్​ రావత్​ బాగా సెట్​ అయ్యారు. దీంతో తెలుగు ఛత్రపతి బాక్సాఫీస్​ వద్ద సెన్సేషన్​ క్రియేట్​ చేసింది. అయితే హిందీ రీమేక్​లో మాత్రం ఈ మదర్ సెంటిమెంట్​, ప్రదీప్​ రావత్​ విలనిజం ఎలిమెంట్స్​ ఏవీ బాగా పండలేదని అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.