ETV Bharat / entertainment

తారక్​ టార్చ్​బేరర్​​, బన్నీ ఐకాన్​.. కానీ పవన్​, చరణ్​ అలాంటోళ్లు!: హీరో సత్యదేవ్​

author img

By

Published : Dec 8, 2022, 12:13 PM IST

మెగాస్టార్ చిరంజీవి 'గాడ్‌ఫాదర్‌', బాలీవుడ్ స్టార్ అక్షయ్​కుమార్​ 'రామ్‌సేతు'లో కీలకపాత్రలు పోషించి సినీ ప్రముఖులు, అభిమానుల ప్రశంసలు అందుకున్నారు నటుడు సత్యదేవ్‌. ప్రస్తుతం తన తదుపరి చిత్రం 'గుర్తుందా శీతాకాలం' ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా ఫ్యాన్స్​తో కలిసి ట్విటర్‌ చాట్‌ చేశారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో కూల్​ సమాధానాలు చెప్పారు. ఆ సంగతులు..

Etv Bharat
Etv Bharat

నటనలో వైవిధ్యాన్ని చూపించి, అనతికాలంలోనే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు హీరో సత్యదేవ్‌. ప్రస్తుతం ఆయన 'లవ్​మాక్​టైల్'​కు రీమేక్​గా రూపొందిన 'గుర్తుందా శీతాకాలం' చిత్రంలో నటించారు. ఈ మూవీ డిసెంబర్​ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఫ్యాన్స్​తో కలిసి ట్విటర్‌ చాట్‌ చేశారు. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఎంతో కూల్​ సమాధానాలు చెప్పారు. ఆ సంగతులు..

'రామ్‌సేతు'లో ఏపీగా మీ నటన నాకెంతో నచ్చింది. మీ తదుపరి చిత్రాలను హిందీలోనూ విడుదల చేయండి? లేదా బాలీవుడ్‌ చిత్రాల్లో నటించండి?
సత్యదేవ్‌: మీరు నాపై చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు సంతోషిస్తున్నా. భవిష్యత్తులో తప్పకుండా మిమ్మల్ని అలరించడానికి మరిన్ని ప్రాజెక్ట్‌లు చేస్తాను.
ఒకవేళ నటుడు కాకపోయి ఉంటే మీరు ఏ రంగాన్ని ఎంచుకునేవారు?
సత్యదేవ్‌: నువ్వు అడిగే వరకూ ఆలోచించలేదు. దర్శకుడిని అయ్యేవాడినేమో.

ఎన్టీఆర్‌తో కలిసి మీరు నటిస్తే చూడాలని ఉంది?
సత్యదేవ్‌: గట్టిగా కోరుకోండి. నేను కూడా ఎదురుచూస్తున్నా.
'రామ్‌సేతు' కోసం అక్షయ్‌కుమార్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?
సత్యదేవ్‌: అక్షయ్‌ కుమార్‌ అంటే ప్రేమ. ఆయనతో మరెన్నో చిత్రాల్లో నటించాలని ఉంది. ఈ సినిమా తర్వాత ఆయనకు వీరాభిమాని అయిపోయా.

Hero Satyadev comments on pawankalyan ramcharan
అక్షయ్​ కుమార్​తో

రీమేక్స్‌ మీద ప్రేక్షకులు ఆసక్తి కనబర్చడం లేదు కదా. అలాంటప్పుడు 'గుర్తుందా శీతాకాలం'ను థియేటర్‌లో ఎందుకు రిలీజ్‌ చేస్తున్నారు? ఓటీటీకి ఇవ్వొచ్చుగా
సత్యదేవ్‌: ఓటీటీకి అడిగారు. కాకపోతే, ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూస్తేనే ఆ ఫీల్‌ వస్తుందని భావించాం.
చిరంజీవితో కలిసి వర్క్‌ చేయడం ఎలా ఉంది?
సత్యదేవ్‌: మేజికల్‌గా అనిపించింది. ఆ రోజుల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా.

Hero Satyadev comments on pawankalyan ramcharan
చిరంజీవితో

నువ్వు ఏం చేస్తావో తెలియదు.. పవన్‌-సుజిత్‌ సినిమాలో మాకు అనిరుధ్‌ కావాలి?
సత్యదేవ్‌: నాది కూడా సేమ్‌ ఫీలింగ్‌.

'గుర్తుందా శీతాకాలం' ఎలా ఉండనుంది?
సత్యదేవ్‌: నవ్వుతారు, ప్రేమిస్తారు, కన్నీరు పెట్టుకుంటారు. సినిమా చూశాక.. దీన్ని చూడమని మీ స్నేహితులకు తప్పకుండా చెబుతారు. అలాగే, ఒకే టికెట్‌పై మూడు ప్రేమ కథలు చూడనున్నారు.

తమన్నాతో కలిసి పనిచేయడం ఎలా ఉంది? ఆమె నుంచి ఏం నేర్చుకున్నారు?
సత్యదేవ్‌: వృత్తి పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తి. స్వీట్‌ హార్ట్‌
నీ పలుకుబడి ఉపయోగించి #SSMB28 అప్‌డేట్‌ ఇప్పించు..!
సత్యదేవ్‌: నా పలుకుబడితో 'గుర్తుందా శీతాకాలం' టికెట్‌ ఇప్పించగలను. కానీ, #SSMB28 అప్‌డేట్‌ ఎలా?

Hero Satyadev comments on pawankalyan ramcharan
మహేశ్ సినిమా

సినిమాపై కాస్త కూడా ఆసక్తి రావడం లేదు. బాగుంటే మెసేజ్‌ చెయ్‌.. టికెట్‌ బుక్ చేసుకుంటా?
సత్యదేవ్‌: చూశాను.. బాగుంది.. బుక్‌ చేసుకో..
మీ డ్రీమ్ రోల్‌ ఏమిటి?
సత్యదేవ్‌: చిరంజీవి చేసిన చంటబ్బాయ్‌!!

నాకు ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ ఉన్నారు. మీ సినిమా కథ నాకు కనెక్ట్‌ అయ్యేలా ఉంది. మూడు టికెట్లు ఇప్పించండి..!
సత్యదేవ్‌: మూడు టికెట్లా? అంటే నువ్వు రావడం లేదా?
'రామ్‌సేతు'లో ఏపీ పాత్ర పోషించడానికి మీరు ఎలా సన్నద్ధమయ్యారు?
సత్యదేవ్‌: పూర్తిగా శాకాహారిగా మారాను. సుమారు రెండు నెలలపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉన్నాను.

పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ గురించి ఏమైనా చెప్పండి?
సత్యదేవ్‌: పవర్‌స్టార్‌ - ఫైర్‌ స్ట్రోమ్‌
చరణ్‌ - మోస్ట్‌ లవబుల్‌ స్టార్ ఆఫ్‌ ఇండియా
తారక్‌ - టార్చ్‌ బేరర్‌
బన్నీ - ఐకాన్‌
ప్రభాస్‌ - మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌
చిరంజీవి గురించి ఒక్కమాటలో చెప్పండి?
సత్యదేవ్‌: ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం చాలా కష్టం. ఆయన అంటే చాలా ప్రేమా, అభిమానం ఉన్నాయి.

Hero Satyadev comments on pawankalyan ramcharan
చిరంజీవితో

ఇదీ చూడండి: పవన్​ లవ్ లీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.