ETV Bharat / entertainment

కళ్లు చెదిరే రేంజ్​లో 'గుంటూరు కారం' బిజినెస్ - ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ టార్గెట్ ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 4:12 PM IST

Guntur Kaaram Theatrical Rights: మహేశ్​బాబు- శ్రీలీల లీడ్ రోల్స్​లో తెరకెక్కిన చిత్రం 'గుంటూరు కారం'. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఇప్పటికే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకోగా, తాజాగా మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్​ రైట్స్ పూర్తయ్యాయి.

Guntur Kaaram Theatrical Rights
Guntur Kaaram Theatrical Rights

Guntur Kaaram Theatrical Rights: సూపర్​స్టార్ ​మహేశ్​బాబు- త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కిన 'గుంటూరు కారం' రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో సినిమా అడ్వాన్స్​ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడవుతున్నాయి. అటు ఓవర్సీస్​లోనూ బుకింగ్స్ జోరందుకున్నాయి. తాజాగా ఈ మూవీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తయ్యాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్ నెట్​ఫ్లిక్స్ 'గుంటూరు కారం' డిజిటల్ రైట్స్​ను సొంతం చేసుకుంది. అటు వరల్డ్​వైడ్​గా థియేట్రికల్ రైట్స్​ బిజినెస్ రూ.134.6 కోట్లు జరిగింది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.104.1 కోట్ల బిజినెస్ జరిగింది. అత్యధికంగా నైజాం థియేట్రికల్​ రైట్స్​ రూ.42 కోట్లకు ప్రముఖ నిర్మాత దిల్ ​రాజు దక్కించుకున్నారు. ఇక ఉత్తరాంధ్ర రూ.14 కోట్లు, సీడెడ్​ రూ.13 కోట్లు, తూర్పు గోదావరి రూ. 8.8 కోట్లు, గుంటూరు రూ.7.8 కోట్లు, పశ్చిమ గోదావరి రూ.6.5 కోట్లు, కృష్ణా రూ.6.5 కోట్లు, నెల్లూరు రూ.4 కోట్లకు సినిమా రైట్స్ అమ్ముడయ్యాయి. మరో రూ.9.5 కోట్ల బిజినెస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగింది. అటు ఓవర్సీస్​లో రూ.21 కోట్లకు ఓప్పందం కుదిరింది.

దీంతో ఈ సినిమా వరల్డ్​వైడ్​గా రూ.134.6 కోట్ల బిజినెస్ చేసింది. దీంతో గుంటూరు కారం బ్రేక్ ఈవెన్​కు చేరుకోవాలంటే రూ.135 కోట్ల షేర్ వసూళ్లు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే పెరిగిన బజ్, మహేశ్​బాబు ఇమేజ్ కారణంగా ఓపెనింగ్ కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండవచ్చని ట్రేడ్ వర్గాల టాక్. ఇక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే, ఈ టార్గెట్ బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.

Guntur Kaaram Overseas Collection: ఓవర్సీస్​లో ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ.10 కోట్లు దాటిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే 1 మిలియన్ బుకింగ్స్ దాటినట్లు తెలుస్తోంది. అలాగే యూకేలో 16 వేలు, ఆస్ట్రేలియాలో లక్షకు పైగా టికెట్లు అమ్మడయ్యాయట. ఇక రిలీజ్​కు రెండు రోజుల సమయం ఉండడం వల్ల బుకింగ్స్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఫుల్​ స్వింగ్​లో 'గుంటూరు కారం' ఓవర్సీస్​ బుకింగ్స్​ - ఎన్ని కోట్లు కలెక్ట్ అయ్యాయంటే?

మహేశ్ ఫ్యాన్స్​పై నమ్రత ఇంట్రెస్టింగ్​ పోస్ట్​ - ఇప్పుడిదే ట్రెండింగ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.