ETV Bharat / entertainment

Sarkaruvaari pata: మహేశ్ గ్లామర్​ పెరగడానికి అసలు కారణం అదేనట!

author img

By

Published : May 6, 2022, 10:21 AM IST

Sarkaru vaari pata Mahesh Galmour secret: సూపర్​స్టార్​ మహేశ్​బాబు గ్లామర్​ సీక్రెట్​ను లీక్​ చేశారు ఫైట్​ మాస్టర్స్​ రామ్​-లక్ష్మణ్​. దీంతోపాటే మహేశ్​ ఎంతో క్రమశిక్షణగా ఉంటారని, ఎప్పుడూ వర్క్​పైనే దృష్టి పెడతారని చెప్పుకొచ్చారు.

Sarkaru vaari pata Mahesh Galmour secret
మహేశ్​ గ్లామర్​ సీక్రెట్​ ఇదే

Sarkaru vaari pata Mahesh Galmour secret: సూపర్​స్టార్​ మహేశ్​బాబు అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 46 ఏళ్లు వచ్చినా ఇంకా గ్లామర్​గా, యంగ్​ లుక్​లో కనిపిస్తూ సినీప్రియులు, అమ్మాయిల మనసును దోచేస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ మూవీలో అంతకముందు కన్నా మరింత గ్లామర్​గా, సరికొత్త లుక్​లో కనిపించి ఫ్యాన్స్​ను ఆకట్టుకున్నారు. మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైట్​ మాస్టర్స్​ రామ్​-లక్ష్మణ్​ మహేశ్​ అంత హ్యాండ్సమ్​గా కనిపించడానికి గల కారణాన్ని చెప్పారు.

"మహేశ్​ ఇంత అందంగా, కూల్​గా, ఛార్మింగ్​గా కనిపించడానికి కారణం ప్రతిరోజు ధ్యానం చేయడమే. ఆయన రోజు మూన్​ యోగా చేస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు రెండు పూటలా యోగా, వర్కౌట్స్​ చేస్తారు. ఆరోగ్యకరమైన ఆహారన్ని తీసుకుంటారు. ఎక్కువ మాట్లాడరు. సైలెంట్​గా ఉంటూ పని మీద మాత్రమే దృష్టి పెడతారు. క్రమశిక్షణగా ఉంటారు. ఇదే ఆయన గ్లామర్ సీక్రెట్​. అందుకే ఆయన ఇంత కూల్​గా, ఛార్మింగ్​ లుక్​లో కనిపిస్తారు" అని రామ్​-లక్ష్మణ్​ అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: విజయ్‌ 'జనగణమన'లో హీరోయిన్​ ఈ ముద్దుగుమ్మేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.