ETV Bharat / entertainment

మెగాస్టార్​ కాకుండా చిరంజీవిని ఇంకేమని పిలుస్తారో తెలుసా

author img

By

Published : Aug 22, 2022, 12:24 PM IST

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. ఆ అరుదైన గౌరవం చిరంజీవికే దక్కింది. ఆయన్ను మెగాస్టార్​ కన్నా ముందు ఏమని పిలిచేవారంటే?

Do you know Megastar Chiranjeevi titles
మెగాస్టార్​ కాకుండా చిరంజీవిని ఇంకేమని పిలుస్తారో తెలుసా

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో ఎదిగిన నటులు చాలా మందే ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే జాబితాలోకి వస్తారు. 1978లో 'ప్రాణం ఖరీదు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆయనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అగ్రస్థాయి హీరోగా పేరు పొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు అగ్రస్థాయి హీరోలుగా ఉన్న సమయంలో చిరంజీవి హీరోగా నటించి ఎన్నో ఘన విజయాలను అందుకున్నారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన్ను అభిమానులు ముద్దుగా మెగాస్టార్ అని పిలుచుకుంటుంటారు. అయితే ఇంతకీ ఆ బిరుదు ఆయనకు ఎలా వచ్చింది? ఇంకా ఏఏ బిరుదులు ఉన్నాయో తెలుసుకుందాం..

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. ఆ అరుదైన గౌరవం చిరంజీవికి దక్కింది. తొలినాళ్లలో 'సుప్రీమ్‌ హీరో'గా పేరొందిన ఆయన ఆ తర్వాత 'మెగాస్టార్‌'గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన 'మరణ మృదంగం'తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాణ కె. ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు.

అంతకు ముందు వరకూ ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో సుప్రీమ్‌ హీరో అని కనిపిస్తుంది. చిరు 'సుప్రీమ్‌ హీరో'గా కనిపించిన చివరి చిత్రం 'ఖైదీ నంబరు. 786'. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఈ రెండింటిపైనా పాటలు రావటం విశేషం. డేరింగ్, డాషింగ్ డైనమిక్, నట కిషోర్, రోరింగ్ లయన్, ఘరానా చిరంజీవి, నట విజేత అని చిరంజీవి సంబోధించేవారు. ఇప్పుడు మెగాస్టార్​తో పాటు గాడ్ ఫాదర్ అని కూడా సంభోదిస్తున్నారు.

ఇదీ చూడండి: చిరంజీవి చేసిన ఈ సాహసాలు తెలుసా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.