ETV Bharat / entertainment

'గేమ్​ ఛేంజర్​' సెట్స్​లో శంకర్​ బర్త్​డే సెలబ్రేషన్స్.. దిల్​ రాజు, చెర్రీ ఏం చేశారో తెలుసా?

author img

By

Published : Aug 17, 2023, 11:16 AM IST

Updated : Aug 17, 2023, 11:31 AM IST

Director Shankar Birthday Celebrations : స్టార్​ డైరెక్టర్ శంకర్​​ బర్త్​డే సందర్భంగా 'గేమ్​ఛేంజర్​' టీమ్​ ఆయనకు ఓ స్వీట్​ సర్​ప్రైజ్​ ఇచ్చింది. అదేంటంటే ?

Director Shankar Birthday Celebrations
Director Shankar Birthday Celebrations

Director Shankar Birthday Celebrations : తన మార్క్​ డైరెక్షన్​లో ఎన్నో సూపర్​ హిట్​ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన స్టార్​ డైరెక్టర్​ శంకర్ ఇప్పుడు మరో రెండు భారీ ప్రాజెక్టులను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. లోక నాయకుడు కమల్​ హాసన్​ 'ఇండియన్​-2'తో పాటు గ్లోబల్​ స్టార్​ రామ్​ చరణ్​తో 'గేమ్‌ ఛేంజర్‌' సినిమాలను తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Shankar Birthday Pics : అయితే ఆగస్టు 17 న శంకర్ బర్త్‌ డే. ఈ సందర్భంగా 'గేమ్‌ ఛేంజర్‌' మూవీ టీమ్​.. సెట్స్‌లో శంకర్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్​గా చేసింది.ఇందులో భాగంగా రామ్​ చరణ్​, దిల్‌ రాజుతో పాటు మూవీ టీమ్​ మెంబర్స్​ కలిసి పార్టీలో సందడి చేశారు. శంకర్‌తో బర్త్ డే కేక్‌ కట్‌ చేయించిన దిల్​ రాజు.. ఆయనకు కేక్​ తినిపించి విషెస్​ తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్​ అవుతోంది.

Shankar Game Changer Movie : ఇక శంకర్​ లైనప్​ చూస్తే.. ప్రస్తుతం ఆయన 'గేమ్‌ ఛేంజర్‌'తో పాటు 'ఇండియన్​ 2' సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక గేమ్​ ఛేజంర్​లో రామ్​ చరణ్​, కియారా అద్వానీ లీడ్​ రోల్స్​ పోషిస్తుండగా.. అంజ‌లి, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, సునీల్, జ‌య‌రాయ్‌ కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

Shankar Indian 2 Movie : మరోవైపు శంకర్-కమల్ హాసన్‌ కాంబోలో వస్తున్న మరో సినిమా 'ఇండియన్ 2' పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతున్న ఈ సినిమాలో కమల్​తో పాటు బాబీ సింహా, సిద్దార్థ్‌, ఎస్‌జే సూర్య, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్‌ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ సుంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శంకర్​కు, నాకు కొద్దిలో చావు తప్పింది: కమల్ హాసన్​

'గేమ్​ ఛేంజర్' మూవీకి​ శంకర్ ఫస్ట్​ ఛాయిస్​ 'చరణ్'​ కాదంట.. మరెవరో తెలుసా?

Last Updated :Aug 17, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.