ETV Bharat / entertainment

మహేశ్ బాబు కోసం సిద్ధం చేసిన కథలో హీరోగా​ ఆలీ!

author img

By

Published : Dec 20, 2022, 7:17 PM IST

'ఆలీతో సరదాగా షో'తో కమెడియన్​ ఆలీ ఎంతో మందికి చేరువయ్యారు. కమెడియన్​గా మంచి స్టార్​డం తెచ్చుకున్న ఈయన పలు సినిమాల్లో హీరోగా కూడా చేశారు. లేటెస్ట్​గా తన ప్రోగ్రాంకు తనే గెస్ట్​గా వచ్చి అలరించారు. ఆ సమయంలో హోస్ట్​గా వ్యవహరించిన యాంకర్​ సుమతో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. అవేంటంటే..

comedian ali was casted as main lead in yamaleela
comedian ali

ఆలీతో సరదాగాలో కమెడియన్​ ఆలీ

సినిమాల్లో సీన్​ పండేలా నవ్వులు పూయించే అతి కొద్దిమంది స్టార్స్​లో ఆలీ ఒక్కరు. బాలనటుడిగా సినీ ప్రవేశం చేసిన ఆలీ ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారక్టర్​ ఆర్టిస్ట్​గా మెరిసి అందరి దృష్టిని ఆకర్షించారు. అలా క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ నుంచి కమెడియన్​గా అంచెలంచలు ఎదిగిన ఆలీని హీరోను చేసింది మాత్రం ఎస్వీ కృష్ణారెడ్డి. అసలు ఆయన ఆలీనే ఎందుకు ఎంచుకున్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.

"మాయలోడు ఆడియో ఫంక్షన్‌లో ఓ సాంగ్‌కు డ్యాన్స్‌ చేశా. అనుకోకుండా అది వాళ్లు చూశారు. ఒకరోజు నాకు చెక్‌ ఇచ్చి, అగ్రిమెంట్‌ చేయించుకున్నారు. ఎక్కువ రోజులు షూటింగ్‌ చేయాల్సి ఉంటుందేమోనని అనుకున్నా.ఆ తర్వాత హీరో నేనని తెలిసింది. అసలు ఈ సినిమాకు హీరో మహేశ్‌బాబు. కృష్ణగారికి కూడా కథ నచ్చింది. అయితే, 'రెండు మూడేళ్లు ఆగండి. మహేశ్‌ చదువుకుంటున్నాడు' అన్నారట. అయితే, కృష్ణారెడ్డిగారు ఎగ్జైట్‌మెంట్‌ ఆపుకోలేక నన్ను తీసుకున్నారు. మనీషా బ్యానర్‌లో నటించాలని అందరూ అనుకుంటారు." నేను నాలుగు సినిమాలు హీరోగా చేశా. నేను హీరోను అవుతానని జీవితంలో అనుకోలేదు. రాజబాబుగారిలా కమెడియన్‌ అవుదామనుకున్నానంతే". అని ఆలీ తన మనసులో మాట పంచుకున్నారు.

"రాళ్లపల్లి, జంధ్యాల, జిప్‌ మోహన్‌ మిత్రగారు. చైల్డ్‌ఆర్టిస్ట్‌గా నాకు రాఘవేంద్రరావు, రవిరాజా పినిశెట్టిగార్లు అవకాశాలు ఇస్తే, కమెడియన్‌గా నన్ను బాగా ప్రోత్సహించింది ఈవీవీగారు. ఇక హీరోగా ఎస్వీకృష్ణారెడ్డిగారు మర్చిపోలేని గుర్తింపు ఇచ్చారు. నాకోసం పాత్రలు సృష్టించిన వాళ్లు పూరి జగన్నాథ్‌, రాజమౌళి, వి.వి.వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇలా చాలామంది ఉన్నారు. ఇక నేను ఎక్కువగా పవన్‌కల్యాణ్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, నితిన్‌, అల్లు అర్జున్‌, అల్లరి నరేష్‌ ఇలా చాలా మందితో నటించా. సుమతో కలిసి ఆడియో ఫంక్షన్స్‌లో నేను చేసిన స్కిట్‌లు, పాత్రలు ట్రెండ్‌ సృష్టించాయి" అని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.