Waltair veerayya: వంద కోట్ల క్లబ్​లో 'వాల్తేరు వీరయ్య'.. మూడు రోజుల్లో ఎంతంటే?

author img

By

Published : Jan 16, 2023, 12:26 PM IST

Updated : Jan 16, 2023, 1:02 PM IST

Chiranjeevi Walteru veriah 4 day collections

మెగాస్టార్ చిరంజీవి-రవితేజ నటించిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. మొత్తంగా మూడు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..

మెగాస్టార్​ చిరంజీవి, మాస్​ మహారాజా రవితేజ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకుడు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్​ ముందు దూసుకెళ్తోంది. సూపర్ హిట్ టాక్​ను అందుకున్న ఈ చిత్రం తొలి రోజు నుంచి మంచి వసూళ్లను అందుకుంటోంది. మొత్తంగా మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.108కోట్ల గ్రాస్​ను అందుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది.

కాగా, చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా యాక్షన్, డ్యాన్స్​లు సహా బ్రదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ను ఊర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా చిరు, రవితేజ మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్‌ను విపరీతంగా అలరిస్తున్నాయి. చిరు డ్యాన్స్​లు, నటన చూసిన వారందరూ వింటేజ్ చిరంజీవిని చూసినట్లు ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఈ సినిమా వీపరీతంగా అలరిస్తోంది. ప్రకాష్ రాజ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించారు. శ్రుతి హాసన్, కేథరిన్​ హీరోయిన్స్​గా కనిపించారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్‌తో సాగే సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రాజమౌళి, కీరవాణిపై అవతార్​ డైరెక్టర్​ ప్రశంసలు.. భార్యతో కలిసి 2 సార్లు సినిమా చూశానంటూ..

Last Updated :Jan 16, 2023, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.