బాలయ్య 'అన్​స్టాపబుల్​'లో మెగాస్టార్​.. షారుక్​ సినిమాలో రానా!

author img

By

Published : Jun 23, 2022, 9:57 AM IST

Chiranjeevi in Balayya Unstoppable

బాలయ్య 'అన్​స్టాపబుల్​' రెండో సీజన్​ తొలి ఎపిసోడ్​లో మెగాస్టార్​ చిరంజీవి సందడి చేయనున్నారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది. మరోవైపు షారుక్​ ఖాన్​-అట్లీ సినిమాలో రానా కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది.

Chiranjeevi Unstoppable with NBK: బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రసారమైన 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' తొలి సీజన్​ ఎంతలా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే రెండో సీజన్​ ప్రారంభంకాబోతున్నట్లు ఇటీవలే మేకర్స్​ ప్రకటించారు. ఆగస్టు 15న వివరాలు తెలియజేస్తామన్నారు. అయితే ఇప్పుడీ షో గురించి ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్​ సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతోంది. తొలి సీజన్​లో గెస్ట్​గా వస్తారనుకున్న మెగాస్టార్​ చిరంజీవి.. రెండో సీజన్​లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం సాగుతోంది. మొదటి ఎపిసోడ్​కే ఆయన్ను తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్​. ఆ తర్వాత వెంకీ, నాగార్జున కనిపిస్తారని టాక్​. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఆగస్టు 15వరకు వేచి ఉండాల్సిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. 'గాడ్​ఫాదర్'​, 'వాల్తేరు వీరయ్య'లతో చిరు బిజీ అవ్వగా.. 'ఎన్​బీకే 107' చిత్రంలో బాలయ్య నటిస్తున్నారు. ఆ తర్వాత అనిల్​రావిపూడితో చేయనున్నారు.

Rana in Sharukh-Atlee film: బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​-విలక్షణ నటుడు రానా కలిసి నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి హిందీ, తమిళ చిత్రసీమ వర్గాలు. నాలుగేళ్లుగా సిల్వర్​స్క్రీన్​కు దూరంగా ఉన్న షారుక్​.. 2023లో ఒకేసారి మూడు చిత్రాలతో రానున్నారు. 'పఠాన్'​, 'జవాన్'​, 'డంకీ'తో ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే వీటిలో 'జవాన్'​ మూవీని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనే రానా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుందట. ఒకవేళ ఇదేకనుక నిజమైతే రానా ఖాతాలో మరో బిగ్ ప్రాజెక్ట్​ చేరినట్టే.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్​గా నటించనున్న నయనతార ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. షారుక్​ ఓ పాత్రలో 'రా' అధికారిగా, మరో పాత్రలో గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నారని సమాచారం. నాలుగేళ్ల నుంచి షారుక్​ తెరపై కనపడకపోవడంతో ఈ సినిమా కోసం బాద్‌షా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక షారుక్​ ఈ మూవీలతో పాటు 'రాకెట్రీ', 'లాల్​ సింగ్​ చద్ధా', 'బ్రహ్మాస్త్ర', 'టైగర్​ 3'లో అతిథి పాత్రలో మెరవనున్నారు.

ఇదీ చూడండి: 'నన్ను వారంతా కిడ్నాపర్​ అనుకొని'.. స్టార్​ డైరెక్టర్​ కామెంట్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.