అల్లు ఫ్యామిలీపై మెగాస్టార్​ చిరు ఇంట్రెస్టింగ్ కామెంట్స్​.. ఏమన్నారంటే..

author img

By

Published : Oct 1, 2022, 3:12 PM IST

chiranjeevi allu family
చిరంజీవి అల్లు ఫ్యామిలీ ()

అల్లు ఫ్యామిలీపై కీలక వ్యాఖ్యలు చేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం అది సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. ఇంతకీ మెగాస్టార్ ఏమన్నారంటే...

నటుడిగా తాను మెగాస్టార్ స్థాయికి ఎదగడానికి అల్లు రామలింగయ్యే కారణమని మెగాస్టార్​ చిరంజీవి గుర్తుచేసుకున్నారు. అల్లు రామలింగయ్య పేరుతో ఏర్పాటు చేసిన స్టూడియోను తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా, ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌లో నిర్మాత అల్లు అరవింద్‌ నిర్మించిన అల్లు స్టూడియోస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి పాల్గొని ఈ స్టూడియోను ప్రారంభించారు.

"మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నా. ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ కొద్దిమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అరవింద్‌, బన్నీ, శిరీశ్‌‌‌, బాబీ.. సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారంటే కారణం కొన్నిదశాబ్దాల క్రితం పాలకొల్లులో ఆయన మదిలో మెదిలిన ఓ చిన్న ఆలోచన. నటనపై ఉన్న మక్కువతో మద్రాసు వెళ్లి.. నటుడిగా మంచి స్థానాన్ని సొంతం చేసుకోవాలని ఆయనకు వచ్చిన ఆలోచన ఇప్పుడు పెద్ద వ్యవస్థగా మారింది. దానికి ప్రతిక్షణం అల్లు వారసులు ఆయన్ని తలచుకుంటూనే ఉండాలి. ఈ స్టూడియో ఒక స్టేటస్‌ సింబల్‌. అల్లు అనే బ్రాండ్‌తో అల్లు రామలింగయ్య పేరును తరతరాలు గుర్తించుకునేలా.. దీన్ని నిర్మించారు. ఈ కుటుంబంలో నేను కూడా భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నా" అని చిరంజీవి వివరించారు.

అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. "ఇవాళ మా తాతయ్య 100వ పుట్టినరోజు. మాకెంతో ప్రత్యేకం. అల్లు అరవింద్‌కు అగ్ర నిర్మాణ సంస్థ ఉంది.. స్థలాలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్టూడియో పెట్టడం పెద్ద సమస్య కాదు అని కొందరు అనుకొని ఉండొచ్చు. కానీ, డబ్బు సంపాదించడం కోసం మేము ఈ స్టూడియోను నిర్మించలేదు. ఇది మా తాతయ్య కోరిక. ఆయన జ్ఞాపకార్థం దీన్ని నిర్మించాం. ఇక్కడ సినిమా షూటింగ్స్‌ బాగా జరగాలని, పరిశ్రమకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నా" అని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: ఆచార్య పరాజయంపై స్పందించిన చిరు.. ఆయన చెప్పిందే చేశామంటూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.