ETV Bharat / entertainment

పవన్​ 'హరిహర వీరమల్లు'లో స్టార్​ బాలీవుడ్​ యాక్టర్​.. స్పెషల్​ వీడియో రిలీజ్​

author img

By

Published : Dec 24, 2022, 12:44 PM IST

పవన్​ కల్యాణ్​ హరిహర వీరమల్లు సినిమాలో స్టార్ బాలీవుడ్​ యాక్టర్​ నటించనున్నారు. తాజాగా ఆయన్ను సెట్​కు గ్రాండ్​గా స్వాగతం పలికింది మూవీటీమ్​. ఆ వీడియోను షేర్ చేసింది.

hari hara veera mallu  Pawan Kalyan
పవన్‌కల్యాణ్‌ హరహరమల్లు

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ - క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్​. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ యాక్టర్​ బాబీ డియోల్‌ నటిస్తారనే ఎప్పుడో నుంచి ప్రచారం సాగుతోంది.

అయితే తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేసింది. ఆయన్ను సెట్స్​లోకి గ్రాండ్​గా ఆహ్వానిస్తున్న వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్​గా మారింది. ఇకపోతే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.